ఆత్మకూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

Published : Mar 22, 2024, 03:58 PM ISTUpdated : Mar 22, 2024, 04:02 PM IST
ఆత్మకూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో హేమాహేమీ రాజకీయ నేతలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఆత్మకూరు. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే కాదు కేంద్ర మంత్రిగా, యూపీ గవర్నర్ గా పనిచేసిన బెజవాడ గోపాల్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా పనిచేసారు. ఆయన తర్వాత కూడా మరికొందరు రాజకీయ ప్రముఖులు ఆత్మకూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నత పదవులు పొందారు. ఇక ప్రస్తుతం ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్ రెడ్డి కొనసాగుతున్నారు. మరి ఈసారి ఆత్మకూరు అసెంబ్లీలో గెలుపెవరిదన్న ఉత్కంఠ నెలకొంది.  

ఆత్మకూరు రాజకీయాలు :

నెల్లూరు జిల్లా రాజకీయాలను ఆనం, మేకపాటి కుటుంబాలు శాసిస్తున్నాయి. అయితే ఈ రెండు కుటుంబాలకు ఆత్మకూరు రాజకీయాతో ప్రత్యక్ష సంబంధం వుంది. సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉన్నత విద్యావంతుడు, రాజకీయ పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందినవాడు కావడంతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవగానే వైఎస్ జగన్ మంత్రివర్గంలో గౌతమ్ కు చోటుదక్కింది. కానీ హటాత్తుగా గుండెపోటుకు గురయి ఆయన మరణించారు.  దీంతో ఆత్మకూరులో ఉప ఎన్నికలు జరగ్గా గౌతమ్ సోదరుడు విక్రమ్ ఎమ్మెల్యేగా గెలిచాడు.  

ఇక ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఆయన  తండ్రి వెంకట్ రెడ్డి కూడా ఆత్మకూరు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా పనిచేసారు.  2009 లో ఆనం ఆత్మకూరులో పోటీచేసి గెలిచారు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లలో మంత్రిగా పనిచేసారు. 

ఇదిలావుంటే గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరులో వైసిపి గెలుస్తూ వస్తోంది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి, 2022 ఉప ఎన్నికల్లో విక్రమ్ రెడ్డి గెలిచారు. ప్రస్తుతం మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు...  ఆయనే 2024 అసెంబ్లీ ఎన్నికల వైసిపి అభ్యర్థి.    

ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. చేజర్ల
2. అనుమసముద్రంపేట
3. అనంతసాగరం
4. ఆత్మకూరు
5. సంగం 
6. మర్రిపాడు

ఆత్మకూరు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,09,051
పురుషులు -   1,93,823
మహిళలు ‌-    1,05,216

ఆత్మకూరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

ఆత్మకూరు అసెంబ్లీ బరిలో గతసారి మేకపాటి గౌతమ్ రెడ్డి పోటీచేసారు. అయితే ఆయన అకాల మరణంతో మేకపాటి విక్రమ్ రెడ్డి ఉపఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ఇప్పుడు మళ్లీ విక్రమ్ రెడ్డినే ఆత్మకూరు పోటీలో నిలిపింది వైసిపి. 

టిడిపి అభ్యర్థి :

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఆత్మకూరు పోటీలో నిలిపింది. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో వైసిపి నుండి టిడిపి వైపు మళ్లారు ఆనం. దీంతో ఆయనను ఆత్మకూరు టికెట్ దక్కింది. 

ఆత్మకూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలు 2022 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,37,289 (64 శాతం)

వైసిపి - మేకపాటి విక్రమ్ రెడ్డి - 1,02,241 ఓట్లు (74 శాతం) - 82,888 ఓట్ల మెజారిటీతో విజయం 

బిజెపి - భరత్ కుమార్ గుండ్లపల్లి - 19,353 ఓట్లు (14 శాతం) - ఓటమి

ఆత్మకూరు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :

వైసిపి - మేకపాటి గౌతమ్ రెడ్డి - 92,758 (53 శాతం) - 22,276 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - బొల్లినేని కృష్ణయ్య - 70,482 (40 శాతం) - ఓటమి

 
 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం