మనుషులు చనిపోతుంటే పట్టించుకోరు.. జగన్ రెడ్డి కటౌట్ తగలబడితే మాత్రం హడావుడి.. పోలీసులపై అచ్చెన్నాయుడు ఫైర్..

Published : Nov 19, 2022, 02:02 PM IST
మనుషులు చనిపోతుంటే పట్టించుకోరు.. జగన్ రెడ్డి కటౌట్ తగలబడితే మాత్రం హడావుడి.. పోలీసులపై అచ్చెన్నాయుడు ఫైర్..

సారాంశం

ఈ రోజు మంగళగిరిలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు రాష్ట్రంలో పోలీసుల తీరుపై మండిపడ్డారు. 

విజయవాడ : మంగళగిరిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... మూడున్నరేళ్ల రావణాసురుడి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది. రాష్ట్ర ప్రజలను సమస్యలు చుట్టుముట్టాయి. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలే ఉండకూడదు, తానే శాశ్వతంగా పాలించాలనే దుష్ట ఆలోచన జగన్ రెడ్డిది. మూడున్నరేళ్లలో 36 మంది టీడీపీ కుటుంబసభ్యులను పొట్టన పెట్టుకున్నారు. లక్షలాదిమందిని ఇబ్బందులకు గురిచేశారు. దాడులు చేసి, అక్రమ కేసులు పెట్టి జైలు పాల్జేశారు. వైసీపీ దుర్మార్గాలపై మనమెన్ని ఫిర్యాదులు చేసినా కేసులు పెట్టకుండా వైసీపీ కండువా కప్పుకున్న పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. 

మనుషులు చనిపోతున్నా పట్టించుకోని పోలీసులు... రావణాసుడైన జగన్ రెడ్డి కటౌట్ తగలబడితే మాత్రం హడావుడి చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? టీడీపీ కార్యకర్తల కష్టం, త్యాగాలు వృథాగా పోవు. వచ్చే ఎన్నికల్లో 161 స్థానాల్లో గెలుపు మనదే. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. శ్రీకాకుళంతో మొదలైన ప్రభుత్వ వ్యతిరేక తిరుగబాటు మహానాడుతో ఉదృతమై కర్నూలు జిల్లా మీదగా కొనసాగుతోంది. మన అధినేత చంద్రన్న కర్నూలు జిల్లా పర్యటనలో జన ప్రవాహంతో వైసీపీలో వణుకు మొదలైంది. జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పలికేందుకు సిద్ధమైన ప్రజలు చంద్రన్న పర్యటనకు ఘన స్వాగతం పలికారు. 

వైఎస్ జగన్ కటౌట్ కు నిప్పంటిన దుండగులు.. గూడురులో దారుణం..

వైసీపీ పని అయిపోయింది. ఎన్నికలు ఎప్పుడొస్తాయా,  జగన్ రెడ్డిని ఎప్పుడు సాగనంపుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ వైసీపీ పేటీఎం బ్యాచ్ దాడికొచ్చారు. ప్రజలు వారిని తరిమికొట్టారు. రాష్ట్రానికి ఐరన్ లెగ్ జగన్ రెడ్డే. రాష్ట్రాన్న సర్వనాశనం చేశాడు. అన్ని రంగాల్లో వెనక్కు నెట్టాడు. ఏ వర్గం ప్రజలూ నేడు సంతోషంగా లేరు. ప్రజలు రోడ్ల మీదకు రావాలి. మనం నాయకత్వం వహిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 
రేపు ఎన్నికల్లో గెలవకపోతే చివరి ఎన్నికలన్న చంద్రబాబు గారి మాటలను వైసీపీ కుక్కలు వక్రీకరించారు. 

రాబోయేవి చంద్రబాబుకు చివరి ఎన్నికలు కాదు. ఐదు కోట్ల మంది ప్రజలు పడుతున్న బాధలకు విముక్తి కలిగించడానికి ఇవి చివరి ఎన్నికలు. ఏపీకి రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితికి తీసుకెళ్లిన జగన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి చివరి ఎన్నికలు. ఈ వయసులో చంద్రబాబు గారు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. ఒక్క అవకాశం పేరుతో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పాచి నోరు జగన్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర,రాయలసీమ ప్రజలను తన రాజకీయ ప్రయోజనాల కోసం అభివృద్ధికి దూరం చేస్తున్నాడు. ఏపీకి అమరావతి రాజధాని అని తాను ఒప్పుకోలేదని జగన్ రెడ్డిని అనమనండి .. నేను ఇక్కడే ఉరేసుకుంటాను. రాష్ట్ర భవిష్యత్ గురించే మా తపనంతా. 

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గారు ఏపీకి మంచి భవిష్యత్ ఇవ్వాలనుకుంటున్నారు. 2020 పేరుతో తెలంగాణలో అభివృద్ధి మోడల్ ను విజయవంతంగా అమలు చేశారు. ఆ మోడల్ నే ఏపీలో తయారుచేయాలని చంద్రబాబు గారు కష్టపడుతుంటే జగన్ రెడ్డి కుట్రలు చేసి సర్వ నాశనం చేశాడు. మన మధ్యే తగాదాలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. స్వార్థంతో కొందరు దద్దమ్మలు వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్ర భవిష్యత్ , బాబు కోసం మన అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిద్దాం. మన నాయకుడిని ఎవరైనా విమర్శిస్తే అక్కడి కక్కడే మూకుమ్మడిగా బుద్ధి చెప్పాలి. చంద్రబాబు గారి వాహనాలపై ఉద్దేశపూర్వకంగానే రాళ్లు వేస్తున్నారు. మనం ఫిర్యాదు చేస్తు పట్టించుకోవడం లేదు. 

వైసీపీ కుక్కలు మొరిగితే మనం తొడలుగొట్టి బుద్ధి చెప్పాలి. కలిసికట్టుగా పనిచేద్దాం. అతి విశ్వాసం పక్కనపెట్టి నేటి నుంచి 18 మాసాలు కష్టపడి పనిచేద్దాం. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రావడం మన ధ్యేయం. ఇకపై వైసీపీ అనే పార్టీ కానీ, జగన్ రెడ్డి కానీ రాష్ట్రంలో కనిపించకూడదు. పార్టీ ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నాం. నేడు మన నాయకుడు చంద్రబాబు కొత్త కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. చంద్రబాబు గారు పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. టీడీపీ గెలుపు ఖాయం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu: అధికారులకు చంద్రబాబు హెచ్చరిక | Asianet News Telugu
CM Chandrababu Naidu: చరిత్రలో నిలిచిపోయే రోజు సీఎం చంద్రబాబు| Asianet News Telugu