
గుంటూరు జిల్లా నకరికల్లు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ కార్యకర్తలు డి.రాజా, నాగోతు ఎన్నయ్యలకు టీడీపీ నేత కింజారపు అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. వీరి మృతి బాధాకరమని, రాజా, ఎన్నయ్యల ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని కోరుకుంటున్నానన్నారు.
రాజా, ఎన్నయ్య కుటుంబానికి టీడీపీ అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారి సభ్యులకు తెలుగుదేశం పార్టీ ప్రగాఢ సానుభూతి తెలుపుతోందన్నారు. ప్రమాదం ఎటునుండి పొంచి వుంటుందో తెలియడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు ప్రయాణాల్లో కార్యకర్తలంతా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నానన్నారు.
కార్యకర్తలందరూ చీకటి పడేలోపే పార్టీ కార్యక్రమాలు ముగించుకుని సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని విన్నవిస్తున్నామని తెలిపారు.