అచ్చెన్నాయుడికి బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్

By narsimha lodeFirst Published Jun 15, 2020, 2:02 PM IST
Highlights

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు సోమవారం నాడు ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
 


హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు సోమవారం నాడు ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ నెల 12వ తేదీన ఈఎస్ఐ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసింది. అనారోగ్య కారణాలతో జీజీహెచ్ ఆసుపత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

also read:అచ్చెన్నాయుడి పరామర్శకు చంద్రబాబుకు నో పర్మిషన్

అచ్చెన్నాయుడుకి బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో ఆయన తరపు న్యాయవాది ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మరో పిటిషన్ ను కూడ దాఖలైంది.

మెరుగైన వైద్య చికిత్స తీసుకొనేందుకు వీలుగా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు కూడ అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్ ను కూడ ఏసీబీ కోర్టులో అచ్చెన్నాయుడు న్యాయవాదులు ఇవాళ దాఖలు చేశారు.

ఈ రెండు పిటిషన్లపై ఏసీబీ కోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఉద్దేశ్యపూర్వకంగానే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని టీడీపీ ఆరోపించింది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారని ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఆరోపించారు.

click me!