అచ్చెన్న అరెస్ట్.. నిద్రకూడా పట్టడం లేదా..? విజయసాయి సెటైర్లు

Published : Jun 15, 2020, 01:45 PM IST
అచ్చెన్న అరెస్ట్.. నిద్రకూడా పట్టడం లేదా..? విజయసాయి సెటైర్లు

సారాంశం

 అచ్చెన్న తమ గుట్లన్నీ బయటకు కక్కుతాడేమో అన్న భయంతో అబ్బా కొడుకులకు నిద్ర పట్టడం లేదంట.’’ అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.  

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు వరసగా అరెస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలను అరెస్టు చేశారు. వీరి అరెస్టులను ప్రస్తావిస్తూ.. విజయసాయి.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు.

‘కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ తర్వాత ఫీల్డ్ కొస్తా.. అంతు చూస్తా’. అని చిటికెలేసిన ఉత్తర కుమారుడు ముందే వచ్చాడు.. వెళ్లి పోయాడు. ఏదీ, ఏం జరగలేదే? కూసాలు కదులుతుంటే పొంతన లేకుండా మాట్లాడటం కామన్ అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. నారా లోకేష్‌ బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 సోమవారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ అచ్చెన్న తమ గుట్లన్నీ బయటకు కక్కుతాడేమో అన్న భయంతో అబ్బా కొడుకులకు నిద్ర పట్టడం లేదంట.’’ అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

‘‘అచ్చెన్న అరెస్టును బీసీల అణచివేతగా రంగు పులుముతున్న చంద్రబాబు గారు ఆ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మర్చినట్టున్నారు. 2002లో బాలయోగి గారి దుర్మరణంతో, లోక్ సభ స్పీకర్ పదవికి తనను ఎంపిక చేయాలని ఎర్రన్నాయుడు ప్రాధేయపడ్డాడు. ఎదిగి పోతాడన్న భయంతో ఏ పోస్టు దక్కకుండా చేశాడు ‘విజనరీ’’ అంటూ ఎద్దేవా చేశారు.

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?