జగన్ ఓ తుగ్లక్.. ఆయనలాగే రాజధానులు మారుస్తున్నారు:అశోకగజపతి రాజు

By Rekulapally Saichand  |  First Published Dec 29, 2019, 1:39 PM IST

మాజీ కేంద్రమంత్రి,టీడీపీ సీనీయర్  అశోకగజపతి రాజు  ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఆయన  ఫైరయ్యారు.  మహమ్మద్ బీన్ తుగ్లక్ తరచూ రాజధానులు మార్చేవారని ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తిందన్నారు. 


మూడు రాజధానులపై మాజీ కేంద్రమంత్రి,టీడీపీ సీనీయర్  అశోకగజపతి రాజు స్పందించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఆయన  ఫైరయ్యారు.  

చరిత్రలో మొఘలలు, తర్వాత మహమ్మద్ బీన్ తుగ్లక్ తరచూ రాజధానులు మార్చేవారని ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తిందన్నారు. మూడు రాజధానుల నిర్ణయంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Latest Videos

undefined

" ఏపీ రాష్ట్రాన్ని విభజసించి ఇప్పడు  రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. నాడు అమరావతిలో రాజధాని పెడదామంటే ఊ కొట్టిన   నేటి ముఖ్యమంత్రి... ఇప్పుడు రోజుకో చోట రాజధాని పెడతానంటూ చెబుతున్నారు. 33 వేల ఎకరాల భూములు త్యాగం చేసిన రైతుల పరిస్థితి ఏమిటీ..ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ చేశారు" అన్నారు. 

 
"ఎవరు అడిగితే వారికి రాజధాని ఇచ్చేస్తారా నెలకో రాజధాని పెట్టమనండి అప్పుడు కూడా ఫిబ్రవరి నెలలో 28 రోజులే ఉన్నానయని గొడవ మొదలవుతుంది.  నాడు ఈ నేతలు అధికారంలో ఉన్నప్పుడే విజయనగరంలో కర్ఫ్యూ  వచ్చింది ఇప్పుడు అమరావతిలోనూ అదే పరిస్థితి తలెత్తింది.ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళాన్ని అనుకుంటుదని" జగన్‌పై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు అమరావతిలో జరిగింది.  జీఎన్ రావు కమిటీ పై కేబినెట్ సమావేశంలో చర్చించారు.

వేల కోట్లు పెట్టుబడి పెట్టినా కూడ అమరావతిని అభివృద్ధిని చేయలేమని సీఎం వైఎస్ జగన్ మంత్రులకు వివరించినట్టుగా సమాచారం. అమరావతిలో పెట్టే ఖర్చులో 10 శాతం ఖర్చు చేసినా కూడ విశాఖపట్టణం అభివృద్దిని చేసే అవకాశం ఉందని జగన్ అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.

అలాగే  సుమారు 4వేలకు పైగా ఎకరాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్టుగా  సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది.ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో కొందరు టీడీపీ నేతల పేర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. . అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై లోకాయుక్తకు ఇవ్వాలా, సీబీఐ, సీబీసీఐడీకి ఇవ్వాలా అనే విషయాన్ని న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది.

click me!