విజయవాడలో కాల్‌మనీ కలకలం: ప్రేమ్ సూసైడ్, సెల్పీ వీడియో

Published : Dec 29, 2019, 01:33 PM IST
విజయవాడలో కాల్‌మనీ కలకలం: ప్రేమ్ సూసైడ్, సెల్పీ వీడియో

సారాంశం

విజయవాడలో కాల్ మనీ కలకలం చోటు చేసుకొంది. ప్రేమ్ అనే వ్యక్తి కృష్ణా నదిలో దూకాడ. అతను మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 


విజయవాడ: విజయవాడలో కాల్‌మనీ వేధింపులకు ప్రేమ్ అనే వ్యక్తి కృష్ణా నదిలో దూకాడు.ప్రేమ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రేమ్ మృతి చెందారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఆత్మహత్యకు ముందు ప్రేమ్ సెల్పీ వీడియో రికార్డు చేశాడు. ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడ  పట్టించుకోలేదని ప్రేమ్ ఆరోపించాడు. ఆదివారం నాడు విజయవాడకు సమీపంలో కృష్ణా నదిలో ప్రేమ్ దూకాడు. ప్రేమ్ కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.

తాను  తీసుకొన్న రూ. 4లక్షలకు గాను రూ. 16 లక్షలను వసూలు చేసినట్టుగా ప్రేమ్ సెల్పీ వీడియోలో ఆరోపించారు. తనకు బతకాలని ఉన్నప్పటికీ కూడ కాల్‌మనీ వేధింపుల కారణంగా తాను చావాలని భావిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. పిల్లలను బాగా చదివించాలని భావించానని కానీ సాధ్యం కాలేకపోయిందన్నారు.

తన వల్ల మీరంతా ఇబ్బందిపడ్డారని భార్యతో పాటు  మామకు ఆయన క్షమాపణలు కోరాడు. బతకాలని కోరుకొన్నా కూడ చివరకు ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్టుగా చెప్పారు.

కృష్ణా నదిలో ప్రేమ్ దూకాడు. ప్రేమ్ మృతి చెందినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడలో కాల్‌మనీ వేధింపుల కారణంగా  గతంలో కూడ అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో  వైసీపీ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. మరోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో  ఈ తరహా ఘటనలు తరచూ చోటు చేసుకొంటున్నాయి.


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్