Asani Cyclone Updates : తీరం దాటిన ‘అసని’.. నేటి ఉదయానికి వాయుగుండగా, మళ్లీ బంగాళాఖాతంలోకి చేరే అవకాశం..

Published : May 12, 2022, 07:53 AM IST
Asani Cyclone Updates : తీరం దాటిన ‘అసని’.. నేటి ఉదయానికి వాయుగుండగా, మళ్లీ బంగాళాఖాతంలోకి చేరే అవకాశం..

సారాంశం

అసని తీవ్ర తుపాను తీరం దాటింది. తుపానుగా బలపడి రాత్రికి వాయుగుండగా మారింది. తిరిగి బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ తుపాను ఆంధ్రప్రదేశ్ లో చాలా నష్టాన్ని కలిగించింది. 

అమరావతి : భారీ వర్షాలు, ఈదురు గాలులతో రెండు రోజులుగా కలవరపెట్టిన Asani Cyclone వ్యవసాయ, ఉద్యానవన పంటలకు పెద్ద ఎత్తున నష్టం కలిగించింది. రైతుల్ని నిలువునా మోసం చేసింది. బుధవారం ఉదయానికి తుఫానుగా బలహీనపడింది. రాత్రికి deep depressionగా మారి… మచిలీపట్నానికి 20 కిలోమీటర్లు.. నరసాపురానికి 40 కిలో మీటర్ల మధ్య తీరాన్ని దాటింది. ఇది రాత్రికి ఉత్తర ఈశాన్య దిశగా యానాం, కాకినాడ, తుని తీరాల వెంబడి కదులుతూ వాయుగుండంగా మారి మళ్లీ బంగాళాఖాతంలోకి  ప్రవేశించే అవకాశం ఉంది. తీవ్ర తుఫాన్, తుఫాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో నెల్లూరు, ప్రకాశం, విశాఖ విశాఖపట్నం, శ్రీకాకుళం, గుంటూరు, బాపట్ల, కృష్ణాజిల్లాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో 15.5 సెం.మీ. తిరుపతి జిల్లా ఓజిలిలో 13.6  సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది.

బుధవారం ఉదయం నుంచి తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఉప్పాడ కొత్తపల్లి రహదారి కెరటాల ధాటికి ధ్వంసమయ్యింది. మంగళవారం ఉప్పాడ తీరానికి కొట్టుకువచ్చిన బార్జి ఇసుకలో కూరుకుపోయింది. కెరటాల తీవ్రతకు అది కాకినాడ బీచ్ కు చేరింది. ప్రత్తిపాడు మండలం గోకవరంలో వరద కాలువపై అప్రోచ్ వంతెన కూలిపోయింది.

ముగ్గురు మృతి
అనకాపల్లి జిల్లాలో ఎస్ రాయవరం నుంచి upparapalliకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఎంపీటీసీ సభ్యులు కాసులుపై కొబ్బరి చెట్టు విరిగి పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అమలాపురం  మండలం  కామనగరువు ప్రాంతంలోని అప్పన్నపేటలో పూరిల్లు కూలి అందులో నిద్రిస్తున్న రోజు కూలీ వాకపల్లి శ్రీనివాసరావు (43) చనిపోయారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో పిడుగుపాటుతో ఒకరు మరణించారు.

అసని తీవ్రతతో భారీ వర్షాలు, అధిక వేగంతో ఈదురు గాలులు వీచాయి. దీంతో వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అరటి, బొప్పాయి, కూరగాయల రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు బాపట్ల ప్రాంతాల్లో ఉద్యాన పంటలు, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. ఏలూరులో మూడు చోట్ల విద్యుత్ ఫీడర్లు దెబ్బతిన్నాయి.  కోనసీమ జిల్లాలో ధాన్యానికి మొలకలు వస్తాయి అనే ఆందోళన రైతుల్లో వ్యక్తమైంది. కృష్ణా జిల్లాలో తొమ్మిది వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. మామిడి పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.

అతని తుఫాను ప్రభావంతో కోనసీమ కాకినాడ తూర్పు గోదావరి జిల్లాల్లో గాలులతో పాటు ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. మూడు జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈదురు గాలులతో పలు మండలాల్లో రెండు రోజులుగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ప్రతిపాడు మండల ఈ గోకవరంలో వరద కాలువపై అప్రోచ్ వంతెన శిథిలమయ్యింది. ఉప్పాడ కొత్తపల్లి రోడ్డు దెబ్బతినడంతో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు.

అతని తుఫాను కారణంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా నడిచే పలు విమాన సర్వీసులు బుధవారం రద్దయ్యాయి. రాత్రికి విజయవాడ చేరుకోవాల్సిన ఢిల్లీ హైదరాబాద్ సర్వీసులను రద్దు చేసింది. ఇండిగో విమానయాన సంస్థ నడిపే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, కడప లింక్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. మొత్తంగా 16 సర్వీసులు రద్దు అయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి వెళ్ళే విమానాలు రద్దయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్