
ఏపీలో వెలుగులోకి వచ్చిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో సీఐడీ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ స్కాంలో సంబంధం ఉందంటూ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్యంతో ఉండటం వల్ల ఈరోజు హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ స్కాం లో సంబంధాలు ఉన్నాయంటూ వివిధ రాష్ట్రాలకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా ఆ కేసులో ఏ1 నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఏ1 నిందితుడిగా భావిస్తున్న గంటా సుబ్బారావును అదుపులోకి తీసుకొని హెల్త్ టెస్టింగ్ కోసం విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కు పంపించారు.
రిటైర్డ్ ఐఎఎస్ లక్ష్మీనారాయణకు ఊరట: మధ్యంతర బెయిలిచ్చిన హైకోర్టు
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చారు. అయితే ఇందులో అవినీతి జరిగిందంటూ సీఐడీ పలువురిపై అనుమానం వ్యక్తం చేసి వారి ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణను అరెస్టు చేయాలని భావించిన ఆయన అనారోగ్యంతో హాస్పిటల్ లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. దీంతో ఆయన తరుఫు లాయర్ ఈ రోజు ఉదయమే ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. దీంతో అతనికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 15 రోజుల వరకు లక్ష్మినారాయణను అరెస్టు చేయకూడదంటూ పేర్కొంది. అయితే సోమవారం సాయంత్రం గంటా సుబ్బారావును అరెస్టు చేసింది. కాగా ఈ స్కాంలో రూ. 241 కోట్ల అవినీతి జరిగిందని సీఐడీ భావిస్తోంది.