సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రికి రఘురామ తరలింపు: జైలు నుంచి బయలు దేరిన కాన్వాయ్

By telugu team  |  First Published May 17, 2021, 6:22 PM IST

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీ సీఎస్ అందుకు సన్నాహాలు చేస్తున్నారు.


న్యూఢిల్లీ: వైద్య పరీక్షల నిమిత్తం వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ అందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ అధికారులతో ఏపీ అధికారులు మాట్లాడుతున్నారు. గుంటూరు జైలు నుంచి బయటకు వచ్చిన రఘురామరాజు వాహనంలో కూర్చున్నారు. రఘురామ రాజు కాన్వాయ్ హైదరాబాదుకు బయలుదేరింది.

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామ కృష్ణమ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తమ ఆదేశాలను మెయిల్ ద్వారా పంపుతున్నట్లు తెలిపింది. రఘురామ కృష్ణమ రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేసే బాధ్యతను ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు సుప్రీంకోర్టు అప్పగించిన విషయం తెలిసిందే.

Latest Videos

undefined

గుంటూరు జిల్లా జైలు నుంచి రఘురామకృష్ణమ రాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి పంపించనున్నారు. రఘురామ కృష్ణమ రాజు తరపు న్యాయవాదులు ఇప్పటికే జలైలు వద్దకు వచ్చారు. రఘురామ కృష్ణమ రాజు వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యుడిషియల్ అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు సుప్రీంకోర్టు అప్పగించింది.

రఘురామ తరలింపునకు నాలుగు పోలీసు ఎస్కార్ట్ వాహనాలను గుంటూరు జైలు వద్ద సిద్ధంగా ఉంచారు. రఘురామ సొంత వాహనం కూడా ఉంది. సొంత వాహనంలో పోలీసుల అనుమతితో ఆయనను తరలించనున్నారు. దాంతో రఘురామ ఎస్కార్టులో ఇన్నోవా కారును చేర్చారు. ప్రత్యేక పరిస్థితిలో అందుకు పోలీసులు అనుమతించారు. ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నంత కాలం రఘురామ కృష్ణమ రాజు జ్యుడిషియల్ కస్టడీగానే భావించాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. వైద్య పరీక్షల ఖర్చులు మాత్రం రఘురామ కృష్ణమ రాజు భరించాలని ఆదేశించింది. 

వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజుకు సికింద్రాబాదులోని ఆర్మీ వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రికి పంపించాలని ఆదేశించింది. ఈ విషయంపై దాదాపు మూడు గంటల పాటు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ రోజే రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్ లో తమకు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షలు జరిగిన తీరును వీడియో తీసి తమకు అందించాలని కూడా ఆదేశించింది. 

click me!