నెల్లూరు జిల్లాలో విషాదం: శ్రీహరికోటలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు జవాన్ల ఆత్మహత్య

Published : Jan 16, 2023, 10:15 PM IST
నెల్లూరు జిల్లాలో విషాదం: శ్రీహరికోటలో విధులు నిర్వహిస్తున్న  ఇద్దరు జవాన్ల ఆత్మహత్య

సారాంశం

నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న  ఇద్దరు జవాన్లు  ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయమై  సీఐఎస్ఎప్  ఉన్నతాధికారులకు సమాచారం పంపారు.

నెల్లూరు: జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో విధులు  నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ జవాన్ వికాస్ సింగ్ సోమవారం నాడు రాత్రి గన్ తో  కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.   ఇవాళ ఉదయమే   చింతామణి అనే  జవాన్  చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  చింతామణి  ఛత్తీస్ ఘడ్  రాష్ట్రానికి చెందినవాడు. చింతామణి రాడార్  సెంటర్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. 

 ఒకే రోజు ఇద్దరు  జవాన్లు  ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది.   ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే  జవాన్లు  ఆత్మహత్యలు చేసుకున్నారని సహచరులు ఆరోపణలు చేస్తున్నారు.  వికాస్ సింగ్ ది  బీహర్ రాష్ట్రంగా  గుర్తించారు.మూడేళ్ల క్రితం   షార్ సెంటర్ లో  ఎస్ఐ స్థాయి అధికారి  ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ విషయమై  అప్పట్లో  కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నివేదిక ఆధారంగా  ఇక్కడ విధులు  నిర్వహించే సెక్యూరిటీ సిబ్బంది విషయంలో  తీసుకోవాల్సిన అంశాలపై  షార్ కేంద్రం చర్యలు చేపట్టింది. ఇవాళ ఒక్క రోజులోనే  ఇద్దరు జవాన్లు  ఆత్మహత్య  చేసుకున్న విషయమై  షార్  కేంద్రం కూడా కేంద్రీకరించింది. సీఐఎస్ఎస్ ఉన్నతాధికారులకు  కూడా ఈ సమాచారాన్ని పంపారు. 
 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్