బాబు వల్లే కాలేదు…ఎంపిల వల్ల అవుతుందా ?

Published : Feb 01, 2017, 01:31 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
బాబు వల్లే కాలేదు…ఎంపిల వల్ల అవుతుందా ?

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్రమోడి కన్నెర్ర చేసినదానికే చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా ఊసెత్తటమే మానేసారు. ఇక, ప్యాకేజి కోసం ఎంపిలు కేంద్రంపై ఒత్తిడి తెస్తారా?

 

..

ప్రత్యేకప్యాకేజి పేరుతో తెలుగుదేశం పార్టీ  పార్లమెంట్ లో కొత్త నాటకం మొదలుపెడుతోంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చాలా కాలంపాటు ఒకసారి ప్రత్యేకహోదా కావాలని, మరోసారి అవసరంలేదని రకరకాలుగా నాటకాలాడిన టిడిపి తాజాగా ప్యాకేజి నాటకం మొదలుపెట్టంది. ప్యాకేజికి చట్టబద్దత కోసం ఎంపిలు పార్లమెంట్ లో కేంద్రాన్ని డిమాండ్ చేయాలట. ప్రధానమంత్రి నరేంద్రమోడి కన్నెర్ర చేసినదానికే చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా ఊసెత్తటమే మానేసారు. ఇక, ప్యాకేజి కోసం ఎంపిలు కేంద్రంపై ఒత్తిడి తెస్తారా?

 

మన ఎంపిలతో వచ్చిన సమస్యేమిటంటే చాలా మంది వ్యాపారస్తులు, బడా సంస్ధలకు ఓనర్లు. దాంతో ప్రతీ ఎంపికి కేంద్రంతోనే పని. కాబట్టి కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడే ఛాన్సే లేదు. ఈ విషయం కేంద్రానికి బాగా తెలుసు కాబట్టే ఎవరినీ ఏమాత్రం లెక్క చేయటం లేదు. అరుణ్ జైట్లీ రాష్ట్రానికి ప్రత్యేకసాయం ప్రకటించినప్పటి నుండి చంద్రబాబు ప్రత్యేక ప్యాకిజీకి చట్టబద్దత గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయినా జైట్లీ ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. ఎందుకని పట్టించుకోవటం లేదు?

 

ఎందుకనంటే, జైట్లీ ప్రకటించింది ప్రత్యేకసాయం. చంద్రబాబు అడుగుతున్నది ప్రత్యేక ప్యాకేజికి చట్టబద్దత. జైట్లీ ఏం ప్రకటించారో చంద్రబాబుకు తెలీకుండానే ఉంటుందా? మరి ప్రత్యేకసాయం ప్రకటిస్తే ప్రత్యేక ప్యాకేజికి చట్టబద్దత ఎందుకు అడుగుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. అక్కడే కేంద్రానికి చంద్రబాబు అలుసైపోయారు. ప్యాకేజికి చట్టబద్దత తీసుకురావటం చంద్రబాబు వల్ల కాలేదు. అందుకని పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్యాకేజికి చట్టబద్దత సాధించాలంటూ ఎంపిలపై చంద్రబాబు, లోకేష్ పదేపదే ఒత్తిడి పెడుతున్నారు. చంద్రబాబు వల్లే కానిది ఎంపిల వల్ల ఏమౌతుందన్నదే ప్రశ్న. ప్రత్యేకహోదా పేరుతో దాదాపు ఏడాదిన్నర కాలం గడిపేసారు. ఇపుడు మొదలుపెట్టిన ప్రత్యేక ప్యాకేజి పేరుతో ఇంకెంత కాలం గడిపేస్తారో చూడాలి?

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?