కరోనా దెబ్బ: ఈ నెల 31 వరకు అరసవల్లి టెంపుల్ మూత

Published : Jul 19, 2020, 05:53 PM ISTUpdated : Jul 19, 2020, 05:55 PM IST
కరోనా దెబ్బ: ఈ నెల 31 వరకు అరసవల్లి టెంపుల్ మూత

సారాంశం

రోనా దెబ్బకు శ్రీకాకుళంలోని అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయం ఈ నెల 31వ తేదీ వరకు మూత పడనుంది.శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోతున్నందున  ఈ నెల 31వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకొంది జిల్లా యంత్రాంగం.

శ్రీకాకుళం: కరోనా దెబ్బకు శ్రీకాకుళంలోని అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయం ఈ నెల 31వ తేదీ వరకు మూత పడనుంది.శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోతున్నందున  ఈ నెల 31వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకొంది జిల్లా యంత్రాంగం.

శ్రీకాకుళం పట్టణంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో లాక్ డౌన్ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోనే అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ఉంది. 

also read:కరోనాతో సత్తెనపల్లిలో వ్యక్తి మృతి: రోడ్డుపైనే డెడ్‌బాడీ

దీంతో ఈ ఆలయాన్ని ఈ నెల 31వరకు ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 20వ తేదీ నుండి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు.మరోవైపు ఆలయంలో స్వామివారికి ఏకాంత సేవలు యధావిధిగా కొనసాగించనున్నారు అర్చకులు.

ఆలయాన్ని మూసివేస్తున్నందున భక్తులు ఎవరూ కూడ ఆలయానికి రావొద్దని అధికారులు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలలోని టీటీడీ అనుబంధ ఆలయాలకు కూడ కరోనా ఎఫెక్ట్ కన్పిస్తోంది. శ్రీనివాస మంగాపురం ఆలయాన్ని మూసివేశారు. తిరుచానూరు ఆలయంలో కూడ కరోనా కలకలం నెలకొంది.

తిరుమల ఆలయంలో ఇప్పటికే 170 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. పెద్ద జీయంగార్ కి కరోనా సోకింది. ఆయనను చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్