ఏపీ ఎన్జీవో జేఎసీ నుండి ఏపీటీఎఫ్ బయటకు వచ్చింది. పీఆర్సీ విషయంలో టీచర్లకు అన్యాయం జరిగిందని ఏపీటీఎఫ్ నేతలు అభిప్రాయపడ్డారు.
అమరావతి: ఏపీ NGO జేఏసీ నుంచి ఏపీటీఎఫ్ బయటకు వచ్చింది. జేఏసీలోని పదవులకు ఏపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు JACలోని తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను జేఏసీ చైర్మన్ Bandi Srinivasa Raoకు పంపారు. తమ డిమాండ్ల పరిష్కారంలో జేఏసీ విఫలమైందని APTF నేతలు పేర్కొన్నారు. CPS రద్దు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పరిష్కరించలేక పోయారని మండిపడ్డారు. ఛలో Vijayawadaకు వచ్చిన Employees మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. పీఆర్సీలో టీచర్లకు అన్యాయం జరిగిందన్నారు. తమ ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు.
ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఉద్యోగ సంఘాలు సంతృప్తిని వ్యక్తం చేశారు. కానీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఈ విషయమై సంతృప్తి చెందలేదు. చర్చల విఫలమైనట్టుగా ప్రకటించాయి. దీంతో జేఏసీ నుండి ఏపీటీఎఫ్ బయటకు వచ్చింది.UTF కూడా ఈ చర్చల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి చర్చలు ఆమోదయోగ్యం కాదని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని యూటీఎఫ్ ప్రకటించారు.ఉపాధ్యాయులకు HRA 10 శాతమే ఇస్తామంటున్నారన్నారు. టీచర్లకు 12 శాతమే హెచ్ఆర్ఏ ఇవ్వాలన్నారు. ఇలా చేయకపోతే పాత హెచ్ఆర్ఏను కొనసాగించాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది.
ఇదిలా ఉంటే ఇవాళ ఏపీ పీఆర్సీ సాధన సమితి నేతలు క్యాంప్ కార్యాలయంలో జగన్ తో భేటీ అయ్యారు.ఈ భేటీ తర్వాత సీఎం జగన్ ను ఉద్యోగ సంఘాలు తమ సమస్యలపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. సీఎంది పెద్ద మనసుగా చెప్పారు.. మంత్రుల కమిటీ కొనసాగుతుందని సీఎం హామీ ఇచ్చారన్నారు. ఏవైనా సమస్యలను ఈ కమిటీతో చర్చించవచ్చని సీఎం చెప్పారన్నారు.
ఆర్ధిక పరిస్థితి బావుంటే భవిష్యత్ లో మరింత ప్రయోజనాలు ఉంటాయని సీఎం హామీ ఇచ్చారని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. తాము సాధించిన ప్రయోజనాల భారం రూ.1300 కోట్లని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఐ ఆర్ రికవరీ వల్ల మరో రూ.5 వేల కోట్లు పైన్ ప్రభుత్వం పై భారం పడుతుందన్నారు.ఉపాధ్యాయులు,ఉద్యోగుల ఐక్యత వల్లే ఇది సాధ్యమైందని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే, భవిష్యత్ లో ఇలాగే ఉద్యోగులు సహకారించాలని ఆయన కోరారు.
చలో విజయవాడ కార్యక్రమంలో లక్ష మంది ఉద్యోగులు ఆందోళన చేశారని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ గుర్తు చేశారు. ఫిట్‌మెంట్ లో పెరుగుదల లేకపోయినా మిగిలిన అంశాల్లో సంతృప్తి ఉందని చెప్పారు. హెచ్ఆర్ ఏ అదనపు పెన్షన్ సీసీఏ ల వల్ల ప్రయోజనాలు ఉన్నాయని Suryanarayan అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తమకు సానుకూలంగా ఉందని ఆయన చెప్పారు. పిఆర్సి ఐదేళ్లకు ఒక సారి ఇవ్వడం సంతోషమన్నారు. పీఆర్సీ సాధన సమితి మంత్రుల కమిటీ తో కలిసి భవిష్యత్ లో పనిచేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఫిట్‌మెంట్ తప్ప అన్ని విషయాల్లో ప్రభుత్వం సానుకూలంగా ఉందని పీఆర్సీ సాధన సమితి నేత Venkatram Reddy ప్రకటించారు.