ఏపీఎస్ఆర్టీసీకి కాసులు కురిపించిన సంక్రాంతి.. ఒక్కరోజులోనే రూ.23 కోట్ల ఆదాయం

By Siva KodatiFirst Published Jan 20, 2023, 4:00 PM IST
Highlights

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ రికార్డు స్థాయిలో రూ.23 కోట్ల ఆదాయాన్ని అందుకుంది. కార్గో సర్వీసు కూడా మంచి ఆదాయాన్ని అందుకుంది. ఒక్క రోజులోనే ఏకంగా రూ.55 లక్షలు ఆర్జించింది.

సంక్రాంతి పండుగ ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఆదాయాన్ని నమోదు చేసింది సంస్థ. ఈ నెల 18న ఒక్క రోజులోనే రూ.23 కోట్ల ఆదాయాన్ని సాధించినట్లుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ ఆర్టీసీకి అతిపెద్ద సీజన్. పండుగను అయినవాళ్ల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో సుదూర ప్రాంతాల్లో స్ధిరపడ్డ వారంతా స్వగ్రామాలకు తరలివస్తారు. వీరి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతూ వుంటుంది. ప్రైవేటు ట్రావెల్స్ బాదుడు నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఆర్టీసీనే ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈ ఏడాది సంస్థకు మంచి ఆదాయం లభించింది. 

ALso REad: పల్లెకి పట్న వాసి .. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుకు 1.24 లక్షల వాహనాలు, రెండ్రోజుల్లోనే

ఇక సంక్రాంతి సమయంలో కార్గో సర్వీసు కూడా మంచి ఆదాయాన్ని అందుకుంది. ఒక్క రోజులోనే ఏకంగా రూ.55 లక్షలు ఆర్జించింది. గతంలో ఒక రోజులో అత్యధిక ఆదాయం కింద రూ.45 లక్షలు వుంది. ఈసారి దీనిని బద్దలు కొట్టింది ఆర్టీసీ కార్గో. ప్రయాణీకులకు ముందుగానే బస్సులను అందుబాటులో వుంచడం, అదనపు సౌకర్యాల, ఉన్నత స్థాయి పర్యవేక్షణ కారణంగానే రికార్డు స్థాయిలో ఆర్టీసీ కార్గోకు ఆదాయం సమకూరింది. సిబ్బంది తోడ్పాటు వల్లనే ఈ ఘనత సాధించామని అధికారులు అంటున్నారు. కార్గోతో పాటు ప్రత్యేక బస్సుల పట్ల ప్రయాణీకులు ఆదరణ చూపారని వారు చెబుతున్నారు. ఇదిలావుండగా సంక్రాంతి రద్దీ దృష్ట్యా జనవరి 6 నుంచి 14 వరకు ఏపీఎస్ఆర్టీసీ రికార్డు స్థాయిలో 3,392 ప్రత్యేక బస్సులను నడిపిన సంగతి తెలిసిందే. దీనికి తోడు తిరుగు ప్రయాణంలో పది శాతం డిస్కౌంట్ ఇవ్వడంతో ప్రజలు ఆర్టీసీ వైపే మొగ్గుచూపారు. 
 

click me!