ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు తీపికబురు: కరోనా బీమా వర్తింపజేస్తూ నిర్ణయం

By Siva KodatiFirst Published Aug 19, 2020, 9:55 PM IST
Highlights

కరోనా సంక్షోభ కాలంలో కార్మికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ కార్మికులకు కరోనా బీమా వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది

కరోనా సంక్షోభ కాలంలో కార్మికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ కార్మికులకు కరోనా బీమా వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం కార్మిక పరిషత్ నేతలు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబును కలిసి బీమా కల్పించాలని వినతి పత్రం అందజేశారు.

దీనిపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు రూ.50 లక్షల రూపాయల కోవిడ్ బీమా వర్తింపజేస్తున్నట్లు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని ఆర్టీసీ కార్మికులకు వర్తింపజేస్తూ ఎండీ ఆదేశాలు తీసుకోవడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అదే విధంగా కరోనాతో ఇప్పటి వరకు మరణించిన 36 మంది ఆర్టీసీ కార్మికులకు కూడా ఈ బీమా వర్తింపజేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా మృతుల వివరాలతో సహా ధ్రువపత్రాలను ఈ నెల 28లోపు ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపాలని కృష్ణబాబు అధికారులను ఆదేశించారు.

click me!