ఏపీఎస్ఆర్టీసీలో కరోనా కలకలం.. ఒక్కరోజే 123 మంది ఉద్యోగులకు కరోనా

By Siva KodatiFirst Published Apr 24, 2021, 3:36 PM IST
Highlights

ఏపీఎస్ఆర్టీసీలో కరోనా పంజా విసురుతోంది. కొవిడ్‌బారిన పడుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రెండోదశలో ఇప్పటి వరకు 748 మంది వైరస్‌ బారినపడ్డారు. శుక్రవారం ఒక్కరోజే 123 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తేల్చారు

ఏపీఎస్ఆర్టీసీలో కరోనా పంజా విసురుతోంది. కొవిడ్‌బారిన పడుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రెండోదశలో ఇప్పటి వరకు 748 మంది వైరస్‌ బారినపడ్డారు. శుక్రవారం ఒక్కరోజే 123 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తేల్చారు.

మొత్తంగా గతఏడాది నుంచి ఇప్పటి వరకు 105 మంది ఉద్యోగులు కరోనాతో మృతిచెందారు. తమకు ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యకార్డులు ఇంకా జారీచేయలేదని, దీనివల్ల కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే చికిత్స పొందాల్సి వస్తోందని సిబ్బంది వాపోతున్నారు.

Also Read:అటెన్షన్ ఏపీ: ఒక్కరోజులో 11 వేలకు పైగా కేసులు .. పెరుగుతున్న మరణాలు, చిత్తూరులో తీవ్రత

మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆర్టీసీ మరిన్ని భద్రతాచర్యలు చేపట్టింది. ఏసీ బస్సుల్లో 50 శాతం సీట్లు మాత్రమే ప్రయాణికులకు కేటాయించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి రెండు సీట్లలో ఒకటి ఖాళీగా ఉంచనున్నారు. ఏసీ స్లీపర్‌లో కూడా సగం బెర్తులే కేటాయించేలా సూచించారు. ఆన్‌లైన్‌ టికెట్‌ రిజర్వేషన్‌ సాఫ్ట్‌వేర్‌లో ఈ మేరకు మార్పులు చేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్‌లగ్జరీ సర్వీసుల్లో తొలుత 50 శాతం సీట్లు ఆన్‌లైన్‌లో కనిపించేలా మార్పులు చేస్తున్నారు. 
 

click me!