Sankranthi 2022: ఏపీఎస్ ఆర్టిసి షాక్... సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంపు (Video)

By Arun Kumar PFirst Published Jan 6, 2022, 3:34 PM IST
Highlights

తెలంగాణ ఆర్టిసి ధరలు పెంచడంలేదు కాబట్టి మా బస్సుల్లోనే ప్రయాణించాలని సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ఏపీ ప్రజలను ఎండీ సజ్జనార్ కోరిన విషయం తెలిసిందే. అయితే ఏపీ ఆర్టిసి ఎండీ ద్వారకా తిరుమలరావు మాత్రం ధరలు పెంచినా మన బస్సుల్లోనే ప్రయాణించాలని కోరుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలయ్యింది. 

విజయవాడ: సంక్రాంతి (sankranthi festival) పండక్కి స్వస్థలాలకు వెళ్లే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తెలంగాణ ఆర్టిసి (tsrtc) బస్సుల్లోనే ప్రయాణించి డబ్బుల ఆదా చేసుకోవాలని ఇటీవల ఎండీ సజ్జనార్ (sajjanar) ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి రద్దీని దృష్టిలో వుంచుకుని హైదరాబాద్ (hyderabad) నుండి ఏపీకి నడిపే స్పెషల్ బస్సుల్లో ఎలాంటి ఛార్జీలు పెంచలేదని సజ్జనార్ ప్రకటించారు. కాబ‌ట్టి ఏపీకి వెళ్లే ప్రయాణికులు అంద‌రూ తెలంగాణ ఆర్టీసీలో టికెట్లు బుక్ చేసుకోండి.... డబ్బుల‌ను ఆదా చేసుకోవాలని సజ్జనార్ సూచించారు.

అయితే ఇందుకు భిన్నంగా సంక్రాంతి సందర్భంగా నడిపై స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను భారీగా పెంచుతున్నట్లు  ఏపీఎస్ ఆర్టిసి (APSRTC) ప్రకటించింది. డీజిల్ రేటు 60శాతం పెరగడం, ఒకవైపు బస్సు ఖాళీగా వెళుతుంది కనుక టికెట్ ఛార్జిలను 50% పెంచినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకాతిరుమల రావు (dwaraka tirumalarao) ప్రకటించారు. పరిస్థితులను అర్థం చేసుకుని మన ప్రాంతం వారు మన బస్సులను ఆదరిస్తారని ఆశిస్తున్నానంటూ ఏపీ ఆర్టీసి ఎండీ ఓ ప్రకటన విడుదల చేసారు.

Video

"

సంక్రాంతి పండగ నేపథ్యంలో  ఏపీఎస్ఆర్టీసీ గతంలో కంటే 35% అధికంగా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. 11 రోజులపాటు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు. రేపటి నుంచి అంటే జనవరి 7 నుండి 18 వరకు 6970 అదనపు బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

read more  APSRTC: సంక్రాంతి భారీ స్పెషల్‌ బస్సులు.. పూర్తి వివరాలివే..

ఇప్పటికే రెగ్యులర్ సర్వీసుల్లో 60%, స్పెషల్ బస్సుల్లో 50% ఇప్పటికే రిజర్వ్ అయ్యాయని ఏపిఎస్ ఆర్టిసి ఎండీ తెలిపారు. ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచీ బస్సులు బయలుదేరతాయని అన్నారు. ఒకవేళ కాలనీలు, కూడళ్ళ వద్ద ప్రయాణీకులు ఎక్కువగా ఉంటే అక్కడి నుంచే బస్సు బయలుదేరుతుందని తెలిపారు.

ఎక్కడెక్కడో వుండేవారు ఖచ్చింతంగా సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లాలని అనుకుంటారు... కాబట్టి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. ఈక్రమంలో ప్రతీరోజు తెలంగాణ, కర్ణాటకల నుంచీ ఏపీకి దాదాపు నాలుగు వేల బస్సులు వస్తాయని పేర్కొన్నారు. ఏపీఎస్ ఆర్టీసి కూడా సంక్రాంతి రద్దీకి తగినట్లు ప్రత్యేక బస్ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఏపిఎస్ ఆర్టిసి ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. 

read more  Childrens Day Special: తెలంగాణ ఆర్టిసి భలే ఆఫర్... చిన్నారులకు మాత్రమే

 సంక్రాంతి పండుగ ముందు నుంచే 4,145 ప్రత్యేక బస్సులు న‌డ‌ప‌నున్న‌ది ఏపీ ఆర్టిసి. ముఖ్యంగా హైదరాబాద్​, చైన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు ఈ స్పెషల్​​ బస్సులు నడవనున్నాయని ఎండీ వివరించారు. ఇందులో ఒక్క హైదరాబాద్​కే 1,500 బస్‌ సర్వీసులను కేటాయించారు. విశాఖపట్నానికి 650, విజయవాడకు 250, బెంగళూరుకు 100, చెన్నైకి 45 సర్వీసులు నిర్వహిస్తారు. 

ఇదిలావుంటే ఏపీఎస్ ఆర్టిసి ప్రకటనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. కొందరు నెటిజన్లు సినిమా టికెట్ల ధనలను తగ్గించడం, ఆర్టీసి సంక్రాంతి స్పెషల్ బస్సుల ఛార్జీలను పెంచడాన్ని పోలుస్తూ జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. ఇక టీఎస్ ఆర్టిసి ఛార్జీలు పెంచకుండానే బస్సులు నడుపుతామంటే... చార్జీలు రెట్టింపు చేసినా మన బస్సుల్లోనే ప్రయాణించాలని ఏపీఎస్ ఆర్టిసి కోరడం విడ్డూరంగా వుందని ప్రయాణికులు అంటున్నారు.


 

click me!