APPSC: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. గ్రూపు-1, 2 నోటిఫికేషన్లు, ప్ర‌భుత్వ‌ శాఖల్లో భ‌ర్తీ చేయ‌బోయే ఖాళీలు ఇవే

By Mahesh Rajamoni  |  First Published Nov 3, 2023, 3:59 AM IST

APPSC: అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి డిసెంబర్ నెలాఖరులోగా పరీక్షలు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. త్వరలోనే 88 గ్రూప్-1, 989 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేస్తామనీ, సిబ‌ల‌స్ మార్పుల‌కు సంబంధించి నిపుణులు, మేధావుల‌తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్నారు.
 


Andhra Pradesh Public Service Commission: నిరుద్యోగుల‌కు, ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. వివిధ ప్ర‌భుత్వ‌ శాఖ‌ల్లోని ఉన్న‌తస్థాయి ఉద్యోగాల భ‌ర్తీకి త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్లు జారీ చేస్తామ‌ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అధికారులు తెలిపారు. ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి మొత్తం 23 నోటిఫికేషన్‌లను విడుదల చేయ‌నున్నారు. దాదాపు 1,603 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్లు రానున్నాయ‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 1, 2 నోటిఫికేషన్‌లను నవంబర్ చివరి నాటికి విడుదల చేయనుందనీ, ఇందులో 88 గ్రూప్ I, 989 గ్రూప్ II పోస్టులను భర్తీ చేయనున్నామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు 2024 ఫిబ్రవరిలో జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే, గ్రూప్‌-1,2 అభ్యర్థుల్లో సరైన సమాచారం లేకుండా పరీక్షల నిర్వహణ జాప్యంపై గందరగోళం సృష్టించవద్దని అధికారులను కోరారు. నవంబర్ నెలాఖరులోగా గ్రూప్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, డిసెంబర్ నెలాఖరులోగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరీక్షలు నిర్వహిస్తామని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. 

Latest Videos

undefined

ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్ల‌లో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే.. 

- ఏపీపీఎస్సీ గ్రూప్-1 పోస్టులు: 88

- ఏపీపీఎస్సీ గ్రూప్-2 పోస్టులు: 989

- ఏపీ కళాశాల విద్యలో లైబ్రేరియన్ పోస్టులు: 23

- డిగ్రీ కళాశాల ఫ్యాకల్టీ పోస్టులు: 267

- ఏపీ రెసిడెన్షియల్ కాలేజీ జేఎల్ పోస్టులు: 10

- ఏపీ రెసిడెన్షియల్ కాలేజీ డీఎస్ పోస్టులు: 5

- డీఎల్ఎస్, జేఎల్ఎస్ పోస్ట్‌లు: 78

- పాలిటెక్నిక్ కళాశాలల ఫ్యాకల్టీ: 99

- ఇంగ్లీష్ రిపోర్టర్స్ (లిమిటెడ్) పోస్టులు: 10

- జూనియర్ కాలేజీ ఫ్యాకల్టీ పోస్టులు: 47

- గ్రౌండ్ వాటర్ సర్వీస్ పోస్టులలో అసిస్టెంట్ కెమిస్ట్‌లు: 1

- జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి పోస్టులు: 6

- అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు: 3

- అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు: 1

- టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు: 4

- సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు: 2

- జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (కేటగిరీ 2) పోస్టులు: 1

- సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (కేటగిరీ 4) పోస్టులు: 4

- జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (కేటగిరీ 4) పోస్టులు: 6

- డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు: 38

- ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు: 4

- జూనియర్ అసిస్టెంట్ (జైళ్లు) పోస్టులు: 1

గ్రూప్-II కు సంబంధించి సిలబస్‌లో తాము అనేక హేతుబద్ధమైన మార్పులను తీసుకువచ్చామని గౌతమ్ సవాంగ్ చెప్పారు. రాష్ట్రంలోని జీవో నెంబ‌ర్ 39, 78, 98, 112, క్యారీ ఫార్వర్డ్ పోస్టులను అనుసరించి 900 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి జారీ చేసినప్పటికీ, APPSC 54 శాఖల నుండి ఇంకా పూర్తి వివ‌రాలు అందుకోలేదు. తక్షణ ఇండెంట్ విడుదల కోసం శాఖలతో చర్చలు జరుపుతున్నామనీ, ప్రక్రియలో ఉన్న అన్ని అడ్డంకులను పరిష్కరించి గ్రూప్-2 నోటిఫికేషన్‌లను విడుదల చేస్తామని చెప్పారు. గ్రూప్-1 పరీక్ష, కౌంటింగ్, అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయ పద్ధతిలో, మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.

ఏపీపీఎస్సీ గ్రూప్-1 సిలబస్‌ను మార్చేందుకు ఐఐటీ, హెచ్‌సీయూలోని నిపుణులైన ప్రొఫెసర్లు, రిక్రూటింగ్ ఏజెన్సీలు, దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఆంధ్రా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని నిపుణులైన సీనియర్ ప్రొఫెసర్లతో ఏపీపీఎస్సీ చర్చలు గురించి కూడా తెలిపారు. మార్పుల ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.

click me!