నిరుద్యోగులకు వైఎస్ జగన్ సర్కార్ శుభవార్త .. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల , మొత్తం ఎన్ని పోస్టులంటే..?

Siva Kodati |  
Published : Dec 07, 2023, 08:27 PM IST
నిరుద్యోగులకు వైఎస్ జగన్ సర్కార్ శుభవార్త .. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల ,  మొత్తం ఎన్ని పోస్టులంటే..?

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) గురువారం ఆదేశాలు జారీ చేసింది. 

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) గురువారం ఆదేశాలు జారీ చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 వున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమ్‌నరీ పరీక్ష జరగనుండగా.. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  సిలబస్, నియామక ప్రక్రియలో మార్పులు అనంతరం ఈ ఏడాది గ్రూప్ 2 నోటిఫికేషన్ భర్తీ చేయనుండటం విశేషం. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?