త్వరలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వాటికి ప్రీలిమ్స్ పరీక్ష రద్దు: ఏపీపీఎస్సీ

Siva Kodati |  
Published : Jul 16, 2021, 03:59 PM IST
త్వరలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వాటికి ప్రీలిమ్స్ పరీక్ష రద్దు: ఏపీపీఎస్సీ

సారాంశం

ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ రెడీ అయ్యింది. త్వరలోనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తామని కమీషన్ తెలిపింది. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకు సంబంధించి రోస్టర్ పాయింట్లను ప్రభుత్వం ఖరారు చేయాలని ఏపీపీఎస్సీ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో 1,184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. అంతేకాకుండా గ్రూప్ 1 మినహా ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రీలిమ్స్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆగస్టులో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని కమీషన్ వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆగస్టు నుంచి అమలు చేస్తామని పేర్కొంది. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకు సంబంధించి రోస్టర్ పాయింట్లను ప్రభుత్వం ఖరారు చేయాలని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని 47 ఏళ్ల వరకు పొడిగించాలని, ప్రభుత్వానికి పంపామన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్