వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పార్టీలో జోష్ పెరుగుతున్నది. లీడర్షిప్‌తోపాటు క్యాడర్‌లోనూ ఉత్సాహం రెట్టింపవుతున్నది. నాయకులు దరఖాస్తులు చేసుకోవడానికి లైన్ కడుతున్నారు.
AP Congress: రాష్ట్రం విడిపోయాక ఏపీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థులను వెతుక్కోవాల్సి వచ్చింది. చాలా చోట్ల నామమాత్రంగా అభ్యర్థులను బరిలోకి దింపింది. కానీ, నేడు పరిస్థితులు మెల్లి మెల్లిగా మారుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను వైఎస్ షర్మిల తీసుకున్నప్పటి నుంచి పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఇనాక్టివ్ మోడ్‌లోకి వెళ్లిన నేతలు మళ్లీ క్రియాశీలకం అవుతున్నారు. సీనియర్లు రంగంలోకి దిగుతుండటం, కార్యకర్తల్లోనూ ఉత్సాహం రావడంతో కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఉనికి తప్పకుండా చాటుతుందని అనుకుంటున్నారు. ఇందుకు నిదర్శనం.. వస్తున్న దరఖాస్తుల సంఖ్యేనని పేర్కొంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అఫైర్స్ ఇంచార్జీ మాణికం ఠాగూర్.. ఆశావహుల నుంచి వస్తున్న దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలు ఉండగా.. రాష్ట్రంలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. పార్టీలో చలనం కనిపించడంతో ఆశావహుల సంఖ్య పెరుగుతున్నది. తమకు అవకాశమివ్వాలని, తమ సత్తా చాటుతామని ఆశావహులు చెబుతున్నారు. దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీంతో విజయవాడలోని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌కు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి.
Also Read: Evil: ఏపీలోని ఆ గ్రామంలో భయానక అదృశ్య శక్తి? తెల్లార్లు మెలకువతోనే యువత కాపలా.. అసలేం జరుగుతున్నది?
15 రోజుల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 793 అప్లికేషన్లు, 25 పార్లమెంటు సీట్లకు 105 దరఖాస్తులు ఆంధ్రరత్న భవన్‌కు అందాయి. దరఖాస్తుల గడువు దగ్గరపడటంతో అభ్యర్థుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో మాదిరి కాంగ్రెస్ చతికిలపడిపోదని, ఈ సారి కచ్చితంగా ఇతర రెండు పార్టీలపై దాని ప్రభావాన్ని చూపించే బలాన్ని సమకూర్చుకుంటున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.