హైదరాబాద్‌లోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ.. కదిలించడం కుదరదు, కేసీఆర్‌కు కోపమొస్తే : పోసాని వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Oct 13, 2023, 7:13 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమపై వైసీపీ నేత, ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు . ఆంధ్రా నుంచి వచ్చాం.. ఇప్పుడు వెళ్లిపోతామంటూ కుదరని ఆయన పేర్కొన్నారు. వెళ్లిపోవాలని అనుకుంటే తెలంగాణ సీఎం .. తమ స్థలాలు తమకు ఇచ్చేయాలని అంటారని  పోసాని తెలిపారు. 


తెలుగు చిత్ర పరిశ్రమపై వైసీపీ నేత, ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతుకుపోయిన తెలుగు ఇండస్ట్రీ ఏపీకి రావడం కష్టమన్నారు. సినీ నటులు ఏపీకి వచ్చి పోవడం మాత్రమే చేయగలరని పోసాని పేర్కొన్నారు. ఏపీకి సినీ పరిశ్రమ తరలింపులో ఇబ్బందులు వున్నాయని ఆయన వెల్లడించారు. చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిన సమయంలో ఎలాంటి ఇబ్బంది పడలేదని పోసాని గుర్తుచేశారు.

మద్రాస్ నుంచి వచ్చే సమయంలో తెలుగు, తమిళ భాషలు వేర్వేరు కావున పరిశ్రమ తేలికగా హైదరాబాద్‌కు వచ్చిందన్నారు. అయితే ప్రస్తుతం వున్న పరిస్ధితుల్లో హైదరాబాద్‌లో పాతుకుపోయిన టాలీవుడ్‌ను అక్కడి నుంచి తరలించలేమంటూ కృష్ణమురళి తేల్చిచెప్పారు. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులతో సీఎం జగన్ పలుమార్లు చర్చలు జరిపి అనేక ప్రోత్సాహకాలు ఇస్తామన్నారని ఆయన గుర్తుచేశారు.

Latest Videos

ALso Read: పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు: ఏపీఎఫ్‌డీసీ చైర్మెన్ పోసాని కృష్ణమురళిపై కేసు

విశాఖలో స్టూడియోల నిర్మాణానికి ఎంత భూమి కావాలన్న ఇస్తానని చెప్పారని.. అవసరమైన ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు పోసాని తెలిపారు. ఆంధ్రా నుంచి వచ్చాం.. ఇప్పుడు వెళ్లిపోతామంటూ కుదరని ఆయన పేర్కొన్నారు. వెళ్లిపోవాలని అనుకుంటే తెలంగాణ సీఎం .. తమ స్థలాలు తమకు ఇచ్చేయాలని అంటారని  పోసాని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమకు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తోందని కృష్ణమురళి స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లా కలిసే వుంటున్నారని , అందువల్ల చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుంచి కదిలించడం కష్టమేనని పోసాని తేల్చిచెప్పారు. 

ఈ ఏడాది నుంచి ఎన్టీఆర్ రంగ స్థల అవార్డును ఇస్తున్నామని, దీని కింద రూ.1.5 లక్షల బహుమానం అందజేస్తామని పోసాని కృష్ణమురళి తెలిపారు. అలాగే వైఎస్సార్ రంగస్థల పురస్కారం కూడా అందిస్తున్నామని దీని కింద రూ.5 లక్షలు ఇస్తున్నట్లు పోసాని పేర్కొన్నారు. 
 

click me!