కొత్త పాత్ర ప్రవేశపెట్టిన రఘువీర

Published : Dec 28, 2016, 10:39 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
కొత్త పాత్ర ప్రవేశపెట్టిన రఘువీర

సారాంశం

ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నాయుడులు మాయలపకీర్ల లాగా పనిచేస్తున్నారంటున్న పిసిసి అధ్యక్షుడు రఘువీర

పిసిసి అధ్యక్షుడు  రఘువీరా రెడ్డి విమర్శులు, కార్యక్రమాలు వినూత్నంగా ఉంటాయి. అందుకే, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా, తన విసుర్ల ద్వారా, కొత్త కొత్త కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ సజీవంగా ఉందని నిరూపించారు.


ఈ రోజు ఆయన రాజకీయాల్లోకి కొత్త పాత్ర ప్రవేశపెట్టారు.  అది మాయల పకీర్.


బుధవారంనాడు   పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనంతపురం కాంగ్రెస్‌ కార్యాలయంలో జెండా  ఎగరేశాక మాట్లాడుతూ దేశంలో ఇద్దరుమాయలపకీర్లు తయారయ్యారని అన్నారు.


ఇందులో ఒకరు ప్రధాని మోదీ కాగా, రెండోవారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. వీళ్లిద్దరు రకరకాల మాయలు చేసి ప్రజలను మభ్యపెడుతూ  మాయల పకీర్ ను తలపిస్తున్నారని వ్యాఖ్యానించారు.


పోలవరంకు జాతీయ హోదా తెచ్చి, భారత ప్రభుత్వమే నిర్మాణం చేపట్టేలా చట్టం తెచ్చింది కాంగ్రెస్ అయితే, అదేదే తన మంత్ర శక్తితో తానే తెచ్చానని చంద్రబాబు బుకాయించడం మాయలపకీర్ మాయలాగా ఉందని అన్నారు. 


ఇంత మాయ చేసిన చివరకు కాంగ్రెస్ తెచ్చిన దానికి  కేంద్ర, రా ష్ట ప్రబుత్వాలు  ఇపుడు తూట్లు పొడుస్తున్నాయని అన్నారు. అప్పట్లో రూ.16వేల కోట్లతో పూర్తి కావాలని టెండర్లు పిలిచి కాంగ్రెస్‌హయాంలో రూ.5.50వేల కోట్లు ఖర్చుచేస్తే, కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను రూ.40వేల కోట్లుకు పెంచంది ఎవరి లబ్ది కోసమని ఆయన ప్రశ్నించారు. నాడు మిగిలిన 11 వేల కోట్లు ఖర్చుచేసి, 29వేల కోట్లు దోచుకోవడమే కదా? అన్నారు.


ఇక ప్రధాని మాయల గురించి మాట్లాడుతూ  నోట్ల రద్దుతో మాయల పీకరు బోర్లా పడ్డాడని అన్నారు. నోట్లు రద్దు మంత్రాలు వేసి నల్లకుభేరులను వెతికి తీస్తానని చెప్పి ప్రయివేటు బ్యాంకుల ద్వారా కొత్త నోట్లను నేరు ఆ నల్ల కుబేరుల ఇళ్లకే చేర్చారని అన్నారు.


5లక్షల కోట్లు కొత్తనోట్లు వస్తే ఎక్కువ  నోట్లను ప్రయివేటు బ్యాంకులకు పంపించి, అక్కడి నుంచి  నల్లకుబేరులకు  లారీలు, ట్రక్కుల్లో ఇళ్లకే రవాణా చేశారని అన్నారు.  పేదవాడికి మిగిలింది ఏటీఎంల వద్ద కాపలా... దొరికి తే  రూ.2వేలు,అని ఆయన అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

AP Minister Ramprasad Reddy Lays Foundation for ₹19 Crore Works in Vijayawada | Asianet News Telugu
APCPDCL హెడ్ఆఫీస్ప్రారంభంలోMinister Gottipati Ravi Kumar | APCPDCL Head Office | Asianet News Telugu