‘‘ఐటెం’’ అంటారా... మహిళపై అసభ్య పోస్టులు పెడితే కఠిన చర్యలు : వాసిరెడ్డి పద్మ

By Siva KodatiFirst Published Oct 29, 2022, 3:22 PM IST
Highlights

మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెడితే క్షమించేది లేదని హెచ్చరించారు ఏపీ మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ.  అలాంటి వాళ్లపై డీజీపీ కఠిన చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ సూచించారు.
 

ఏపీ మహిళా కమీషన్ చైర్‌పర్సన్  వాసిరెడ్డి పద్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఐటమ్ వంటి పదాలకు ప్రస్తుతం జైలు శిక్ష పడుతున్నాయని.. అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గుర్తించాలని వాసిరెడ్డి పద్మ సూచించారు. సోషల్ మీడియాలో నీచాతినీచంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అలాంటి వాళ్లపై డీజీపీ కఠిన చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ సూచించారు. స్పెషల్ టీమ్‌లతో సోషల్ మీడియా పోకడలను కట్టడి చేయాలని ఆమె కోరారు. 

ఇకపోతే.. బీజేపీ నేత కుష్బూతో పాటు పలువురు నటీమణులను కించపరిచేలా డీఎంకే నేత సాదిక్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్ర బీజేపీలో వున్న కుష్బూ, నమిత, గాయత్రీ రఘురామన్ వంటి వారంతా ఐటమ్స్ అంటూ సాదిక్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇది రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో కలకలం రేపాయి. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. 

ALso REad:జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు..

మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. మూడు పెళ్లిళ్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఏపీ మహిళా కమిషన్ కోరింది. భరణమిస్తే భార్యను వదిలించుకోవచ్చనే సందేశమిచ్చేలా పవన్ కల్యాణ్ మాటలున్నాయని పేర్కొంది. రూ. కోట్లు, రూ. లక్షలు, రూ. వేలు ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే మహిళలకు భద్రత ఉంటుందా అని ప్రశ్నించింది. మహిళలను ఉద్దేశించి స్టెపినీ అనే పదం పవన్ కల్యాణ్ ఉపయోగించడం ఆక్షేపణీయం అని పేర్కొంది. చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలను పవన్ వెనక్కి తీసుకోవాలని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. మహిళా లోకానికి పవన్ కల్యాణ్ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

click me!