ఏపీలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు.. స్పందించిన వాసిరెడ్డి పద్మ

Siva Kodati |  
Published : Jan 19, 2023, 02:19 PM ISTUpdated : Jan 19, 2023, 02:20 PM IST
ఏపీలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు.. స్పందించిన వాసిరెడ్డి పద్మ

సారాంశం

మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురవుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు ఏపీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ. మహిళా కమీషన్ భాగస్వామ్యంతో విచారణ చేయాలని ఆదేశించామని ఆమె అన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురవుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. కానీ ఎక్కడా రాతపూర్వకంగా ఫిర్యాదు రాలేదని పద్మ తెలిపారు. మహిళా కమీషన్ భాగస్వామ్యంతో విచారణ చేయాలని ఆదేశించామని ఆమె అన్నారు. నివేదికలో వేధింపులకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. రెండ్రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పద్మ కోరారు. 

PREV
click me!

Recommended Stories

Tirumala Vaikunta Dwaram: టికెట్ లేని భక్తులకు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు| Asianet News Telugu
ఫ్యూచర్ కోసం ఈ ఏడాది రిజల్యూషన్ తీసుకుందాం: Doctor Ratna Pemmasani | Plastic | Asianet News Telugu