పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎక్కడ దాక్కున్నారు: గంటాపై అయ్యన్నపాత్రుడు

By narsimha lode  |  First Published Jan 19, 2023, 2:03 PM IST


టీడీపీ ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావుపై  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు  విమర్శలు గుప్పించారు. 


అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావుపై  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు  విమర్శలు  చేవారు.  గురవారంనాడు  ఆయన మీడియాతో మాట్లాడారు.  పార్టీ కష్టకాలంలో  ఉన్నప్పుడు దాక్కొని  ఎన్నికలు వస్తున్నాయని  మళ్లీ వస్తున్నారని  అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేశారు.  ఎవరండీ గంటా.... లక్షల్లో ఒకడు, లక్షల్లో తాను  కూడా ఒకడినని అయ్యన్నపాత్రుడు చెప్పారు. గంటా శ్రీనివాసరావు ఏమైనా పెద్ద నాయకుడా.... ప్రధానా అని  అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.  తమకు అందరూ కావాలని ఆయన  చెప్పారు. టీడీపీకి మొదటి నుండి బడుగులే అండగా ఉన్నారని ఆయన  గుర్తు చేశారు. 

రాజధాని లేని దిక్కుమాలిన రాష్ట్రంగా ఏపీ మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  అధికారం చేతుల్లో లేని హోం మంత్రి పదవి ఉంటే ఎంత లేకుంటే ఎంత అని ఆయన అన్నారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  శాంతిభద్రతలు  ఎలా ఉండాలో చేసి చూపిస్తామన్నారు. తప్పు చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు. 

Latest Videos

undefined

2019 ఎన్నికల్లో  ఏపీలో  టీడీపీ ఓటమి పాలైంది.  ఈ ఎన్నికల్లో  విశాఖపట్టణంలోని ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుండి  గంటా శ్రీనివాసరావు విజయం సాధించాడు. నర్సీపట్నం నుండి పోటీ చేసిన అయ్యన్న పాత్రుడు ఓటమి పాలయ్యాడు.  గంటా శ్రీనివాసరావు పీఏసీ చైర్ెన్  పదవిని ఆశించారు. కానీ పీఏపీ పదవిని చంద్రబాబునాయుడు  పయ్యావుల కేశవ్ కు కట్టబెట్టారు. ఆ తర్వాత నుండి  పార్టీ కార్యక్రమాలకు  గంటా శ్రీనివాసరావు  దూరంగా  ఉంటున్నారు. గంటా శ్రీనివాసరావు  వైసీపీలో చేరుతారని  ప్రచారం సాగింది.  అయితే  ఆయన మాత్రం పార్టీ మారలేదు.

ఇటీవలనే  గంటా శ్రీనివాసరావు  టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి లోకేష్ తో భేటీ అయ్యారు. ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.   కరోనాతో పాటు  తన ఆరోగ్య సమస్యలతో  తాను పార్టీ కార్యక్రమాలకు ఇంత వరకు దూరంగా  ఉన్నట్టుగా  గంటా శ్రీనివాసరావు  చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీలో యాక్టివ్ గా  కొనసాగుతానని  ఆయన  ప్రకటించారు. 2014 ఎన్నికలకు ముందు గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరారు. 2014లో  చంద్రబాబు మంత్రివర్గంలో  గంటా శ్రీినివాసరావు  మంత్రిగా  పనిచేశారు. 

 

click me!