చంద్రబాబులా ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పారేయమన్నారు. అలాగే ప్రజలు తిడతారని చెప్పి ఆన్ లైన్లో నుంచి మేనిఫెస్టోను తొలగించేటంత నీచమైన పరిస్థితికి దిగజారేది లేదన్నారు జగన్. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఒక దైవంలా భావిస్తుందన్నారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. తాము సన్నబియ్యం ఇస్తామని ఏనాడు చెప్పలేదని నాణ్యమైన బియ్యం ఇస్తామని చెప్పామని అయితే దాన్ని టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
నాణ్యమైన బియ్యం ఇస్తామని తాము ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిస్తే దాన్ని సన్నబియ్యం అంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని జగన్ మండిపడ్డారు. తాను ప్రజాసంకల్పయాత్రం చేసిన అనంతరం ఎన్నికలకు ముందు మేనిఫెస్టో విడుదల చేశానని చెప్పుకొచ్చారు.
undefined
అతడి ప్రజాజీవితం చాలా క్లీన్... జగన్ లా కాదు..: పవన్ ను వెనకేసుకొచ్చిన చంద్రబాబు
ఎన్నికల మేనిఫెస్టోలో సన్నబియ్యం అన్న పేరే ఎక్కడా లేదన్నారు. నాణ్యమైన బియ్యం అందిస్తామని చెప్పామని కానీ ఏ తరహా బియ్యం అందిస్తామన్నది కూడా స్పష్టం చేయలేదని జగన్ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చే బియ్యం కంటే నాణ్యమైన బియ్యం ఇస్తామని తెలిపామని చెప్పుకొచ్చారు.
అందుకు రూ.1400 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు జగన్ స్పష్టం చేశారు. నాణ్యమైన బియ్యం ఇస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారంటూ ధ్వజమెత్తారు.
తమకు మేనిఫెస్టో అంటే చాలా గౌరవం ఉందని దాన్ని తూచ తప్పకుండా పాటిస్తామని తెలిపారు. తమ ఎన్నికల మేనిఫెస్టోను తెలుగుదేశం పార్టీ నేతలు కళ్లద్ధాలు సరిచేసుకుని చూడాలని చెప్పుకొచ్చారు.
నాకు హక్కు లేదా, సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు... వంశీ
చంద్రబాబులా ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పారేయమన్నారు. అలాగే ప్రజలు తిడతారని చెప్పి ఆన్ లైన్లో నుంచి మేనిఫెస్టోను తొలగించేటంత నీచమైన పరిస్థితికి దిగజారేది లేదన్నారు జగన్.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఒక దైవంలా భావిస్తుందన్నారు. తమ మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అంటూ చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో హామీలను చూపించే తాము ఓట్లు అడిగామని చెప్పుకొచ్చారు.
తెలుగుదేశం పార్టీ నేతలను పిచ్చాస్పత్రిలో చేర్చినా మారరంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలకు కళ్లు కనిపించకపోతే అద్దాలు సరిచేసుకుని మళ్లీ చదువుకోవాలంటూ సూచించారు.
Ap Assembly: అసెంబ్లీలో స్పీకర్ తో చంద్రబాబు వాగ్వాదం... టీడీపీ నేతల వాకౌట్