Ap Assembly: అసెంబ్లీలో స్పీకర్ తో చంద్రబాబు వాగ్వాదం... టీడీపీ నేతల వాకౌట్

By telugu teamFirst Published Dec 10, 2019, 10:04 AM IST
Highlights

ఇదేం పార్టీ ఆఫీసు కాదని.. ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్టీ ఆఫీసు కాదని తెలుసని.. గతంలో మీరు ఏం చేశారో అన్నీ తెలుసని స్పీకర్‌ తమ్మినేని మాట్లాడారు. దీంతో కాసేపు స్పీకర్-చంద్రబాబు మధ్య ఒకింత మాటల యుద్ధం చోటుచేసుకుంది. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. పంటలకు గట్టుబాటు ధరలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అదే సమయంలో.. వల్లభనేని వంశీ మాట్లాడుతుంటే కూడా టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో... టీడీపీ నేతల తీరుపై స్పీకర్ తమ్మినేని అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదేం పార్టీ ఆఫీసు కాదని.. ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్టీ ఆఫీసు కాదని తెలుసని.. గతంలో మీరు ఏం చేశారో అన్నీ తెలుసని స్పీకర్‌ తమ్మినేని మాట్లాడారు. దీంతో కాసేపు స్పీకర్-చంద్రబాబు మధ్య ఒకింత మాటల యుద్ధం చోటుచేసుకుంది. అయితే స్పీకర్‌ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

కాగా.. అసెంబ్లీకి వెళ్లే ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన చేపట్టారు. ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు టీడీపీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేశారు. పామాయిల్ గెలలు, పత్తిమొక్కలు, వరి కంకులతో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. ఈ నిరసనలో చంద్రబాబు పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందించాలంటూ నినాదాలు చేశారు.

click me!