నాకు హక్కు లేదా, సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు... వంశీ

నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే తాను సీఎం జగన్ ని కలిశానని వంశీ క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్ ని కలిస్తే... చంద్రబాబు కు ఉలుకెందుకు అని ప్రశ్నించారు. టీడీపీ తను బహిష్కరించడాన్ని కూడా వంశీ  ప్రస్తావించారు. కాగా... వంశీ మాటలపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

valabhaneni vamsi comments on chandrababu in Assembly session

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు నడుస్తున్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. కాగా.. ఇవాళ అసెంబ్లీలో ఉల్లి ధరలపై, రైతు భరోసాపై కూడా సభలో స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

కాగా... ప్రశ్నోత్తరాల సమయంలో.. టీడీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుని ఉద్దేశించి కూడా  వల్లభనేని వంశీ మాట్లాడారు. చంద్రబాబు గారు మాకు హక్కులుండవా అని వంశీ ప్రశ్నించారు.

AlsoRead అసెంబ్లీలో స్పీకర్ తో చంద్రబాబు వాగ్వాదం... టీడీపీ నేతల వాకౌట్...

నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే తాను సీఎం జగన్ ని కలిశానని వంశీ క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్ ని కలిస్తే... చంద్రబాబు కు ఉలుకెందుకు అని ప్రశ్నించారు. టీడీపీ తను బహిష్కరించడాన్ని కూడా వంశీ  ప్రస్తావించారు. కాగా... వంశీ మాటలపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాగా... టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయగానే... స్పీకర్ కలగజేసుకున్నారు. సభలో సభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం  చేస్తే సహించనని చెప్పారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీంతో.. వంశీ మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టారు. తాను సభలో కూడా మాట్లాడకూడదా అని వంశీ చంద్రబాబుని ప్రశ్నించారు.  సీఎంని కలిశానని తనను పార్టీ నుంచి బహిష్కరించారని వంశీ పేర్కొనడం గమనార్హం. పప్పు అనే బ్యాచ్ తనను సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారని అతను ఆవేదన వ్యక్తం చేశారు. 

AlsoRead బాబు వస్తున్నారు నా సీటు మార్చండి, సభలో వైసీపీ ఎమ్మెల్యే : జగన్ నవ్వులు...

ఈ సందర్భంగా నారా లోకేష్ పై కూడా పరోక్షంగా సెటైర్లు వేశారు వల్లభనేని వంశీ. పప్పు అండ్ బ్యాచ్ అంటూ విమర్శలు గుప్పించారు. జయంతికి వర్థంతికి తేడా తెలియన వాళ్లు టీడీపీలో ఉన్నారన్నారు.తాను మాట్లాడుతుంటే సభ నుంచి చంద్రబాబు ఎందుకు లేచి వెళ్లిపోయారంటూ ప్రశ్నించారు. తనతో మాట్లాడకుండానే సస్పెండ్ చేశారని మండిపడ్డారు.. అలాంటి పార్టీతో ఇక తాను ఇక కొనసాగలేను అంటూ స్పీకర్‌కు విన్నవించారు . తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని కోరుకుంటున్నానంటూ స్పీకర్‌కు వంశీ రిక్వెస్ట్ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios