Omicron కట్టడికి చర్యలేవి... ప్రజల ప్రాణాలంటే మీకు ఎందుకంత చులకన..: సీఎం జగన్ పై అచ్చెన్నాయుడు సీరియస్

Arun Kumar P   | Asianet News
Published : Dec 26, 2021, 01:26 PM IST
Omicron కట్టడికి చర్యలేవి... ప్రజల ప్రాణాలంటే మీకు ఎందుకంత చులకన..: సీఎం జగన్ పై అచ్చెన్నాయుడు సీరియస్

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్లక్ష్యాన్ని వీడటం లేదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.  

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఒమిక్రాన్ కేసులు (omicron cases in ap) పెరుగుతన్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) నిర్లక్ష్యాన్ని వీడటం లేదని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (atchannaidu) ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలకంటే కక్షసాధింపు చర్యలకే సీఎం (ap cm jagan) ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. కరోనా (corona virus) కట్టడి కంటే కక్షసాధింపు చర్యలే ఈ ముఖ్యమంత్రికి మొదటి ప్రాధాన్యగా మారిపోవడం బాధాకరమని అచ్చెన్న మండిపడ్డారు. 

''ఏపీ (andhra pradesh)లో రోజురోజులు ఒమిక్రాన్ కేసులు మెల్లిగా పెరుగున్నా ప్రభుత్వ యంత్రాంగంలో ఏమాత్రం చలనం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కరోనా మొదటి (corona first wave), రెండో దశ (corona second wave)ల్లో భారీ ప్రాణనష్టానికి కారణమయ్యింది. గత అనుభవాల నుంచి ముఖ్యమంత్రి జగన్ ఎటువంటి పాఠాలు నేర్చుకోకపోవడం సిగ్గుచేటు'' అని మండిపడ్డారు. 

''గతంలో కరోనా మరణాలను తక్కువ చేసి చూపించడంలోనే తెలిసింది జగన్మోహన్ రెడ్డికి ప్రజల ప్రాణాలంటే ఎంత చులకనో. ముఖ్యమంత్రికి ప్రజాధనంతో సొంత పత్రిక సాక్షి (sakshi)లో ప్రకటనలు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను కాపాడటంలో లేకుండా పోయింది'' అని అచ్చెన్న ఎద్దేవా చేసారు. 

read more Omicron Cases in AP: మహమ్మారి బారిన మరో ఇద్దరు...ఏపీలో ఆరుకు చేరిన ఒమిక్రాన్ కేసులు

''రాష్ట్ర బడ్జెట్ లో, ప్రభుత్వ నిధుల మంజూరులో కమీషన్లు వచ్చే పథకాలకే కేటాయింపులు ఘనంగా చేసుకుని కరోనా నివారణ, వైద్య రంగానికి కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేడంలేదు. కరోనా నివారణకు నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా, ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయకుండా కేవలం ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించి రాజకీయ కక్షసాధింపు చర్యలకే జగన్ సర్కార్ ప్రాధాన్యత ఇస్తోంది.  పాలనా సమయం మొత్తం రాజకీయ కుట్రలకే కేటాయిస్తారా?  ప్రభుత్వం సమాధానం చెప్పాలి'' అని ప్రశ్నించారు. 

''ఒమిక్రాన్ కట్టడి చర్యల్లో ఇతర రాష్ట్రాలు ఎలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయో చూసైనా వైసీపీ (ysrcp) ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి. దేశమంతా టీకా ప్రక్రియ వేగంగా జరుగుతుంటే మన రాష్ట్రమేమో వ్యాక్సినేషన్ (corona vaccine) లో వెనకబడి ఉంది. రోజువారీ కరోనా కేసుల్లో 5వ స్థానంలో వ్యాక్సినేషన్ లో 10వ స్థానంలో ఏపీ ఉందంటే అందుకు ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణం'' అని అచ్చెన్న ఆరోపించారు. 

ఏపీలో నిలకడగా కరోనా కేసులు.. 24 గంటల్లో 104 మందికి పాజిటివ్, చిత్తూరులో అత్యధికం

''ఒక్కసారిగా ఒమిక్రాన్ కేసులు పెరిగితే పరిస్థితి ఏంటి? నేటికీ ప్రభుత్వాసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా? వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. వైద్యరంగంపై ముఖ్యమంత్రి నిర్వహించే మొక్కబడి సమీక్షల్లో కనిపించడం మినహా ఆరోగ్య మంత్రి జాడే ఉండటం లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి , వైద్యయంత్రాంగం మొద్దు నిద్ర వీడాలి. కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. ఆస్పత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పించాలి'' అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్