అమరావతి స్మశానమైతే మీరు రాక్షసులా: వైసీపీపై మాజీమంత్రి కళా వెంకట్రావు ఫైర్

By Nagaraju penumalaFirst Published Dec 2, 2019, 4:35 PM IST
Highlights

జగన్  ఆర్నెళ్ల పరిపాలనలో విధ్వంసం, వినాశనం, కక్ష సాధింపు చర్యలు, తిరగబడితే అక్రమ కేసులు పెట్టడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వంటి పరిణామాలు చూస్తుంటే రాజకీయ టెర్రరిజాన్ని తెరలేపుతుందని కిమిడి కళా వెంకట్రావు తెలిపారు.  

శ్రీకాకుళం: వైయస్ జగన్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు. వైసీపీ ప్రభుత్వానిది పిచ్చి తుగ్లక్ పరిపాలన అంటూ మండిపడ్డారు.  
శ్రీకాకుళం జిల్లా రాజాం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిక కళా వెంకట్రావు జగన్ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

వైసీపి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం విషయంలో కుంటిపడిందని ఆరోపించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. అమరావతి స్మశానం అయితే అక్కడ పరిపాలించే వైసీపీ మంత్రులు రాక్షసులా అంటూ నిలదీశారు. 

వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందంటూ మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి ప్రజలను మోసం చేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

నిరుద్యోగ భృతిని నిలిపివేసి ఆరు లక్షల మంది నిరుద్యోగుల పొట్ట కొట్టారంటూ విరుచుకుపడ్డారు. రివర్స్ టెండరింగ్, ఇరిగేషన్ పనులు రద్దు, పంచాయతీ, ఆర్అండ్ బీ రోడ్లు నిలుపు విడుదల వంటి అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏపీలో అభివృద్ధికి ప్రపంచ బ్యాంకులు పెట్టుబడులు ఇచ్చే పరిస్థితి లేకపోవడం విచారకరమన్నారు. ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఇచ్చి ఫైన్ల రూపంలో రూ.24వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 

JusticeForDisha: షాద్ నగర్ కు చంద్రబాబు... దిశా ఉదంతంపై మరోసారి సీరియస్ కామెంట్స్

ప్రభుత్వ స్కూళ్లకు, మహాత్మాగాంధీ విగ్రహాలకు, అంబేద్కర్ విగ్రహాలకు పంచాయితీ కార్యాలయాలకు రంగులు వేసి రూ.1,400 కోట్ల ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారంటూ మండిపడ్డారు.  

జగన్  ఆర్నెళ్ల పరిపాలనలో విధ్వంసం, వినాశనం, కక్ష సాధింపు చర్యలు, తిరగబడితే అక్రమ కేసులు పెట్టడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వంటి పరిణామాలు చూస్తుంటే రాజకీయ టెర్రరిజాన్ని తెరలేపుతుందని కిమిడి కళా వెంకట్రావు తెలిపారు.  

click me!