నేను హోం మంత్రిని అవుతా, అప్పుడు చెప్తా: పోలీసులపై అచ్చెన్నాయుడు

By telugu teamFirst Published Feb 2, 2021, 1:08 PM IST
Highlights

పోలీసుల తీరుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. తాను హోం మంత్రిని అవుతానని, అప్పుడు తప్పుడు కేసులు పెట్టినవారి సంగతి తేలుస్తానని ఆయన అన్నారు.

శ్రీకాకుళం: పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. చాలెంజ్ చేస్తున్నా, రేపు అధికారం తమదేనని ఆయన అన్నారు. తాను హోం మంత్రిని అవుతానని, తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు ఎక్కడున్నా వదలిపెట్టబోనని ఆయన అన్నారు. తమ పార్టీ చీఫ్ చంద్రబాబును ఒప్పించి తాను హోంమంత్రిని అవుతానని ఆయన చెప్పారు.  తన స్వగ్రామం నిమ్మాడలో దౌర్జన్యం చేశారనే ఆరోపణపై అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

నోటీసులు ఇస్తే తానే వచ్చేవాడినని, పోలీసులు అంటేనే విరక్తి కలుగుతోదని ఆయన అన్నారు. డీఎస్పీ, సీఐలు తన బెడ్రూంలోకి వచ్చారని ఆయన చెప్పారు తాను నాయకులను తప్పు పట్టడం లేదని, పోలీసులనే తప్పు పడుతున్నానని ఆయన అన్నారు. పోలీసులను చూసి ఉద్యోగులు సిగ్గుపడుతున్నారని ఆయన అన్నారు.  

కావాలనే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. డీఎస్పీ, సీఐ వైసీపీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉన్న వ్యక్తినని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిని అని ఆయన అన్నారు. 

నిమ్మాడలో అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేసి కోటబొమ్మాళి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఆస్పత్రిలో వైద్య పరక్షలు చేసిన తర్వాత జైలుకు తరలించారు 

ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆంద్రప్రదేశ్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె. అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఆయనను పోలీసులు అరెస్టు చేసి కోటబొమ్మాళి స్టేషన్ కు తరలించారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిని బెదిరించాడనే ఆరోపణపై కోటబొమ్మాళి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.

దాంతో అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిమ్మాడ అచ్చెన్నాయుడి స్వగ్రామం. దాంతో సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని అచ్చెన్నాయుడు భావించారు. అయితే, వైసీపీ మద్దతుదారుడు నామినేషన్ వేయడానికి ముందుకు వచ్చాడు. దీంతో ఆయనను అచ్చెన్నాయుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్, అప్పన్న కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

click me!