రాజమండ్రిలో టీడీపీ మహానాడు.. భద్రత కల్పించండి, ఏపీ డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ

Siva Kodati |  
Published : May 24, 2023, 07:04 PM IST
రాజమండ్రిలో టీడీపీ మహానాడు.. భద్రత కల్పించండి, ఏపీ డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ

సారాంశం

ఈ నెల 27,28 తేదీల్లో రాజమండ్రిలో జరగనున్న టీడీపీ మహానాడుకు బందోబస్తు కల్పించాలని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఈ మేరకు మంగళవారం ఆయన లేఖ రాశారు.   

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం లేఖ రాశారు. ఈ నెల 27,28 తేదీల్లో రాజమండ్రిలో జరగనున్న టీడీపీ మహానాడుకు బందోబస్తు కల్పించాలని అచ్చెన్నాయుడు కోరారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారని.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తుతో పాటు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు తగినంత మంది సిబ్బందిని కేటాయించాల్సిందిగా అచ్చెన్నాయుడు కోరారు. 

మరోవైపు.. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు సంబంధించి, రాష్ట్రాభివృద్ధి ప్రజల సంక్షేమానికి సంబంధించి మహానాడులో 15 తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నామన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. గత శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానంగా ప్రజల సమస్యలు, ఈ ప్రభుత్వం 4ఏళ్లలో తీసుకున్న నిర్ణయాల ప్రభావంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని మహానాడులోప్రధానంగా చర్చిస్తామని యనమల తెలిపారు. ఇప్పుడు జరిగే మహానాడు ఎన్నికలకు ముందు జరిగేది కాబట్టి ప్రధానాంశాలుంటాయని రామకృష్ణుడు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు టీడీపీ రద్దు చేస్తుంది అనేది అవాస్తవమని ఆయన పేర్కొన్నారు.  సంక్షేమ పథకాలకు ఆద్యమే తెలుగుదేశం పార్టీ అన్న ఆయన ఎన్.టీ.రామారావు సంక్షేమ పథకాలకు ఆద్యుడని కొనియాడారు.  

Also Read: టీడీపీ మహానాడులో 15 తీర్మానాలు.. సంక్షేమ పథకాల రద్దుపై యనమల క్లారిటీ

ముఖ్యమంత్రులు ఎందరొచ్చినా ఆయన అమలు చేసిన పథకాలనే మార్చిమార్చి చేస్తున్నారని యనమల దుయ్యబట్టారు. ఉన్ నపథకాలను మరింత ఎఫెక్టివ్ గా , అసలైన అర్హులకు లబ్ధి కలిగేలా వారికి అమలుచేయాలని రామకృష్ణుడు తెలిపారు. ఇతను (సీఎం జగన్) ఏం చేశాడు.. వాళ్ల మనుషులకు మాత్రమే పథకాలు అమలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. అర్హులకు అన్యాయం చేస్తున్నాడని యనమల ఫైర్ అయ్యారు. ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు రద్దు చేశాడని.. వాటిని టీడీపీ అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్న  పథకాల లోటుపాట్లపై కచ్చితంగా సమీక్ష చేస్తామని తెలిపారు. తెలుగుదేశం అంటేనే సంక్షేమ పథకాలని..  ప్రజల సమస్యలకు పరిష్కారమే టీడీపీ అమలుచేసే సంక్షేమమని రామకృష్ణుడు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Serious 🔥 జనం నమ్మి డబ్బులు ఇస్తే.. మీరు ఎందుకు నమ్మలేరు? | Asianet News Telugu
Nara Lokesh Speech: బెంగళూరులో జరిగిన సదస్సులో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu