ఏపీ ఉద్యోగ సంఘాల మధ్య కొత్త ఫైట్ : పార్టీల తరహాలో చేరికలు, వెంకట్రామిరెడ్డి గ్రూప్‌లో చేరిన బొప్పరాజు వర్గం

Siva Kodati |  
Published : May 24, 2023, 06:37 PM ISTUpdated : May 24, 2023, 06:39 PM IST
ఏపీ ఉద్యోగ సంఘాల మధ్య కొత్త ఫైట్ : పార్టీల తరహాలో చేరికలు, వెంకట్రామిరెడ్డి గ్రూప్‌లో చేరిన బొప్పరాజు వర్గం

సారాంశం

బొప్పరాజు వెంకటేశ్వర్లు సారథ్యంలోని ఏపీ జేఏసీ అమరావతికి చెందిన కొందరు సభ్యులు .. వెంకట్రామిరెడ్డి ఛైర్మన్‌గా వున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యలో చేరారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మధ్య కొత్త ఫైట్ జరుగుతోంది. రాజకీయ పార్టీల తరహాలో ఓ సంఘానికి చెందిన సభ్యులను, మరో సంఘంలోకి చేర్చుకుంటున్నారు. తాజాగా బొప్పరాజు వెంకటేశ్వర్లు సారథ్యంలోని ఏపీ జేఏసీ అమరావతికి చెందిన కొందరు సభ్యులు .. వెంకట్రామిరెడ్డి ఛైర్మన్‌గా వున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యలో చేరారు. ఈ వ్యవహారం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బొప్పరాజుపై సెటైర్లు వేశారు. బొప్పరాజుతో తెగేది లేదు.. తేలేది లేదన్నారు. వచ్చే ఎన్నికల వరకు ఉద్యమాన్ని చేపడుతూనే వుంటారని.. సమస్యలు మాత్రం పరిష్కారం కావన్నారు. బొప్పరాజుకు ఉద్యమ చరిత్ర లేదని.. మేనేజ్‌మెంట్‌లో మాత్రం ఆయన దిట్ట అంటూ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత గుర్తింపు కోసమే బొప్పరాజు పోరాటం చేస్తున్నారని.. ఉద్యోగులు సంతృప్తికరంగానే వున్నా, కావాలని రెచ్చగొడుతున్నారని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి.. జ‌గ‌న్ డిమాండ్‌
కోటంరెడ్డి వ్యాఖ్యలపై జగన్ ఫస్ట్ రియాక్షన్ | YS Jagan On Kotamreddy Sridhar Reddy | Asianet Telugu