ఏపీ అసెంబ్లీ నుంచి మళ్లీ టీడీపీ వాకౌట్

By Nagaraju penumalaFirst Published Jul 26, 2019, 2:39 PM IST
Highlights

వైసీపీ మాట్లాడుతున్నంతసేపు తమకు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పట్టుబట్టారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీ శాసన సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. తమ అధినేతకు మైక్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాడీ వేడి చర్చ జరుగుతోంది. మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెట్టి మార్కెటింగ్ బిల్లు 2019 ప్రవేశపెట్టిన నేపథ్యంలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు అధికార పార్టీపై విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. 

రైతులకు రుణాలు ఇవ్వడం లేదని, విత్తనాలు సరఫరా చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం మార్కెటింగ్ బిల్లు ప్రవేశపెడుతున్నామని వైసీపీ స్పష్టం చేసింది. దళారీ వ్యవస్థకు స్వస్తి పలికి రైతుకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా వారికి ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో మార్కెటింగ్ బిల్లు ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేసింది. 

వైసీపీ మాట్లాడుతున్నంతసేపు తమకు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పట్టుబట్టారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీ శాసన సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. తమ అధినేతకు మైక్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం తమ అధినేతకు మైక్ ఇవ్వడం లేదని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ  సభ్యులు అసెంబ్లీని వాకౌట్ చేశారు.     

click me!