నీ బాస్‌లా సంకనాకిపోతావ్: కేశినేనిపై పీవీపీ ట్వీట్

Siva Kodati |  
Published : Jul 26, 2019, 01:41 PM ISTUpdated : Jul 26, 2019, 01:42 PM IST
నీ బాస్‌లా సంకనాకిపోతావ్: కేశినేనిపై పీవీపీ ట్వీట్

సారాంశం

కేశినేని ట్రావెల్స్ సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంపై వైసీపీ నేత పీవీపీ ఫైరయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేనిపై మండిపడుతూ ట్వీట్ చేశారు.

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని నాని.. వైసీపీ నేత పీవీపీల మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ జనం దృష్టిని ఆకర్షిస్తున్నారు.

తాజాగా  తమ జీతాలు చెల్లించకుండా కేశినేని ట్రావెల్స్‌ను మూసేశారంటూ ఆ సంస్ధ సిబ్బంది విజయవాడలో ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై శుక్రవారం పీవీపీ ట్వీట్ చేశారు. కసాయి వాడికి గొర్రె మీద ఉన్న ప్రేమ కూడా నీకు నీ దగ్గర పని చేసే కార్మికుల మీద లేదే?  

వేలాదిమంది పొట్ట కొట్టి ఈ రోజు నువ్వు అందలమెక్కి కూర్చున్నావు! కడుపుకాలి.. ఆ కడుపు మంటతో.. రోడ్డెక్కిన వేలాది కుటుంబాలను మనసుంటే ఆదుకో.. లేదంటే సంకనాకిపోతావు.. నీ బాస్ లాగా అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు బెజవాడలో ఆసక్తికరంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu