అలా చేసి... పథకాలను పంచడమే జగన్ కు తెలుసు: అచ్చన్న ఆగ్రహం

Arun Kumar P   | Asianet News
Published : Dec 17, 2020, 02:36 PM ISTUpdated : Dec 17, 2020, 02:41 PM IST
అలా చేసి... పథకాలను పంచడమే జగన్ కు తెలుసు: అచ్చన్న ఆగ్రహం

సారాంశం

అమరావతి రైతుల ఆందోళన మొదలై నేటికి ఏడాది అవుతున్న తరుణంలో సీఎం బీసీలతో సభలు నిర్వహించడం సిగ్గు చేటని ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.  .

అమరావతి: సంవత్సరం క్రితం అమరావతిని హత్యచేశారని... అయితే హత్య చేసినవారే మళ్ళీ అమరావతి మద్దత్తు చెప్పే రోజులు త్వరలో వస్తాయన్నారు ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు. భారత దేశ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో రాజధాని ప్రజలు, రైతులు 365 రోజులనుండి ఉద్యమం చేస్తున్నారన్నారని... వారికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తోందని అన్నారు. 

''అమరావతి రైతుల ఆందోళన మొదలై నేటికి ఏడాది అవుతున్న తరుణంలో సీఎం బీసీలతో సభలు నిర్వహించడం సిగ్గు చేటు. మూర్ఖపు ముఖ్యమంత్రి బీసీలను మోసం చేస్తున్నాడు. నా ఇల్లు పార్టీ  కార్యాలయాలు ఇక్కడే ఉన్నవి అని చెప్పుకున్న ముఖ్యమంత్రి... ఈనాడు రాజధాని తరలించే ప్రయత్నం చేయడం సిగ్గు చేటు'' అని మండిపడ్డారు. 

read more  ఆనాటి జ్ఞాపకాలు, ఉద్వేగం: యాగశాల వద్ద మోకరిల్లిన చంద్రబాబు

''ఈ ప్రభుత్వం వచ్చా ప్రజలు అయోమయంలో పడ్డారు. పరిశ్రమలు తెచ్చి ఉత్తరాంధ్రకు న్యాయం చెయ్యండి. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఉత్తరాంధ్రపై సీఎం ప్రేమ చూపుతున్నాడు. వెనకపడిన ప్రాంతాల పేరు చెప్పుకుని పబ్బం గడుపుకుంటున్నాడు సీఎం జగన్. రూ.5 కోట్ల ప్రజలందరూ అమరావతి కి మద్దత్తు ఇవ్వండి'' అని కోరారు. 

''ప్రతి రోజు అప్పులు తెచ్చి పథకాలు పంచడమే సీఎం జగన్ కి తెలుసు. చేతకాని అసమర్థ ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరకడం మన దౌర్భాగ్యం. అలాంటి ముఖ్యమంత్రి కి సరైన సమయంలో ప్రజలే బుద్ది చెబుతారు'' అని అచ్చెన్నాయుడు విమర్శించారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?