జగన్ చేతిలో పకోడీలా సిఐడి...: అచ్చెన్నాయుడు సెటైర్లు

Published : Apr 17, 2023, 10:04 AM ISTUpdated : Apr 17, 2023, 10:12 AM IST
జగన్ చేతిలో పకోడీలా సిఐడి...: అచ్చెన్నాయుడు సెటైర్లు

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ సీఐడి సీఎం జగన్ చేతిలో పకోడీలా మారిందంటూ అచ్చెన్నాయుడు ఎద్దేవా చేసారు. 

అమరావతి : మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారంపై విచారణ జరుపుతున్న ఏపీ సీఐడి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మార్గదర్శి వ్యవహారంపై మాట్లాడిన లాయర్లకు సీఐడి నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఇది యావత్ న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడి అని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతిలో పకోడీలా సీఐడి మారిందని అచ్చెన్న ఎద్దేవా చేసారు. 

ఇంతకాలం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రజలు, ప్రతిపక్షాల గొంతునొక్కిన జగన్ రెడ్డి ఇప్పుడు న్యాయవ్యవస్థపై పడ్డాడని అచ్చెన్నాయుడు అన్నారు. అందులో భాగంగానే న్యాయవాదులకు సీఐడి నోటీసులు ఇచ్చిందని అన్నారు. జగన్ పాలనలో న్యాయవాదుల పరిస్థితే ఇలా సామాన్యుల పరిస్థితి ఇంకెలా వుంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. 

రాష్ట్రంలో వైసీపీ నేతలు తప్ప ఇంకెవరూ మాట్లాడకూడదన్నట్టు జగన్ వైఖరి ఉందని అచ్చెన్నాయుడు అన్నారు. లాయర్లకు సీఐడీ నోటీసులు భావస్వేచ్ఛ ప్రకటనకు వ్యతిరేకమన్నారు. న్యాయవాదులకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 126 కింద వృత్తి వ్యవహారం గురించి ప్రశ్నించే హక్క ఎవరికీ  లేదన్నారు.సీఐడీ అధికారులు ఓవరాక్షన్ మానుకోవాలి... లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

Read More  వివేకా హత్య కేసు .. నాలుగేళ్లు ముద్దాయిని జగన్ కాపాడారు : వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై దేవినేని ఉమా

ఇదిలావుంటే ఇప్పటికే మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ చెరుకూరి రామోజీ రావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్‌ను ఏపీ సీఐడీ అధికారులు విచారించారు.మార్గదర్శి చిట్ ఫండ్ లో అవకతవకలు జరిగాయంటూ విచారణ చేపట్టిన సీఐడి ఏ1గా రామోజీరావు, ఏ2గా  శైలజ  కిరణ్‌ లపై కేసు పెట్టారు. అలాగే పలు‌ బ్రాంచీల మేనేజర్లపై కూడా సీఐడి కేసులు నమోదు చేశారు. 

మార్గదర్శిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు సెక్షన్ 160 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం రామోజీరావు, శైలజ కిరణ్‌లకు నోటీసులు జారీ చేసారు.   మోసం చేయడం, డిపాజిట్లను మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించడం, క్యాపిటల్ మార్కెట్‌ల నష్టాలు, చిట్ ఫండ్ బిజినెస్ యాక్ట్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  మార్గదర్శకాలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై నోటీసులు జారీచేశారు. ఈ వ్యవహారంపై చేపట్టిన విచారణకు సహకరించాలని సీఐడి రామోజీ రావు, శైలజ లను కోరింది. 

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాలు, మేనేజర్ల ఇళ్లపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సోదాలు చేసింది.ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1999, చిట్ ఫండ్ యాక్ట్ 1982లను ఉల్లంఘించిన ఆరోపణలపై మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మార్చి 12న ఆంధ్రప్రదేశ్‌లోని మార్గదర్శి శాఖలపై దాడులు నిర్వహించిన అధికారులు నలుగురిని అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం