నేడు తిరుపతి వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త..

By Asianet News  |  First Published Apr 17, 2023, 10:01 AM IST

తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. దీంతో భక్తులు లైన్ లో నిలబడకుండా సులభంగా దర్శనం చేసుకుంటున్నారు.


తిరుపతి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే భక్తులకు పెద్ద శుభవార్త. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. దీంతో మునపటి మాదిరిగా గంటలు గంటలు క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. భక్తుల రద్దీ సోమవారం చాలా తగ్గిపోవడంతో, లైన్లలో నిలబెట్టకుండా డైరెక్టుగానే దర్శనం కల్పిస్తున్నారు టీటీడీ అధికారులు. దీంతో భక్తులు ఎంతో అనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల స్వామి వారిని సులభంగా కంటినిండా దర్శనం చేసుకుంటున్నారు.

హరీష్ రావు ఏమన్నారో తెలియదు కానీ..వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి.. పవన్ కల్యాణ్ వార్నింగ్..

Latest Videos

ఇదిలా ఉండగా.. ఆదివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 76,201 మంది భక్తులు దర్శించుకున్నారు. ఒక్క రోజు ఆదాయం 3.98 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. అలాగే స్వామి వారికి 28,587 మంది భక్తులు తలనీలాలు అందించారు. తమ మొక్కులను చెల్లించారు. 
 

click me!