ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: మద్యం దుకాణాలు ప్రభుత్వం చేతికే

Published : Jul 18, 2019, 09:57 AM ISTUpdated : Jul 18, 2019, 01:11 PM IST
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: మద్యం దుకాణాలు ప్రభుత్వం చేతికే

సారాంశం

భూ తగాదాలను తగ్గించేందుకు ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో మార్పులకు ఉద్దేశించిన ముసాయిదాకు ఆమోదంతోపాటు  మద్యపాన నిషేధంపై కూడా కీలక డైరెక్షన్లు ఇచ్చింది. అలాగే ఇకపై ప్రభుత్వం చేతికే మద్యం దుకాణాల నిర్వహణ, మసాయిదా బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలక బిల్లులకు ఆమోద ముద్రవేసింది. సుమారు 12 బిల్లులకు ఆమోదముద్రవేసింది రాష్ట్ర మంత్రి వర్గం. అందులో భాగంగా కౌలు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పించేలా రూపొందించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 

భూ యజమానులకు నష్టం కలగకుండా రూపొందించిన బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే భూముల రికార్డులను భవిష్యత్తులో ఎవ్వరూ టాంపర్ చేయకుండా, యజమానులకు శాశ్వత ప్రాతిపదికన హక్కులు కల్పించడానికి రూపొందించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం.

భూ తగాదాలను తగ్గించేందుకు ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో మార్పులకు ఉద్దేశించిన ముసాయిదాకు ఆమోదంతోపాటు మద్యపాన నిషేధంపై కూడా కీలక డైరెక్షన్లు ఇచ్చింది. అలాగే ఇకపై ప్రభుత్వం చేతికే మద్యం దుకాణాల నిర్వహణ, మసాయిదా బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
PREV
click me!

Recommended Stories

Nara Lokesh Speech: లూథరన్ క్రీస్తు కరుణాలయం ప్రారంభోత్సవంలో మంత్రి నారాలోకేష్ | Asianet News Telugu
Weather Alert: ఆరేబియా సముద్రం వైపు అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావ‌ర‌ణం ఎలా ఉండ‌నుందంటే