నదుల అంశాల మీద తెలంగాణ స్టడీ చేసినట్టు ఏపీ చేయలేక పోయింది.. సోము వీర్రాజు..

By AN TeluguFirst Published Jun 21, 2021, 10:59 AM IST
Highlights

యోగ డే సందర్భంగా విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యోగ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు. 

యోగ డే సందర్భంగా విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యోగ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రాధాన్యత ఉంది అంటే అది దేశ ఘనత అని అన్నారు. మానవాళి జీవన విధానానికి యోగ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 

రాష్ట్రంలో నదుల అంశాలు మీద తెలంగాణ స్టడీ చేసిన విధంగా ఏపీ చేయలేక పోయిందని విమర్శించారు. ఏపీకి నీటి కేటాయింపులో అన్యాయం జరుగుతుందని, నదుల అనుసంధానంపై  ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. కృష్ణ జలాల విషయంలో ఏపీ బీజేపీ ముందుంటుందన్నారు.

ఆస్తి విలువ ప్రకారం పన్నులు పెంచితే ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. ఇదంతా పొలిటికల్ డ్రామా అని విరుచుకుపడ్డారు.

విశాఖ లో షుగర్ ఫ్యాక్టరీ కి ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. షుగర్ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని, స్టీల్ ప్లాంట్ కూడా అలానే ఉంటుందని అన్నారు. 

click me!