కరోనా ఎఫెక్ట్: ఏపీ స్పీకర్, మంత్రి క్యాంప్ కార్యాలయాల మూసివేత

By narsimha lodeFirst Published Jul 9, 2020, 12:58 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో నేతలు ఆందోళన చెందుతున్నారు. క్యాంపు కార్యాలయాలు మూసివేయాలని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ లు నిర్ణయం తీసుకొన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో నేతలు ఆందోళన చెందుతున్నారు. క్యాంపు కార్యాలయాలు మూసివేయాలని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ లు నిర్ణయం తీసుకొన్నారు.

గురువారం నుండి తమను కలిసేందుకు 15 రోజుల పాటు ఎవరూ కూడ రావొద్దని ప్రకటన విడుదల చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా నేతలు ప్రకటించారు.

also read:24 గంటల్లో 15 మంది మృతి: ఏపీలో 22 వేలు దాటిన కరోనా కేసులు

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ ఇద్దరూ కూడ  క్యాంపు కార్యాలయాలను మూసివేశారు. క్యాంపు కార్యాలయాలు తెరిచి ఉంచితే తమ పనుల కోసం ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది.

ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణం చేసే సమయంలో ప్రజలు కరోనా బారినపడే అవకాశం లేకపోలేదు. దీంతో ఈ క్యాంపు కార్యాలయాలను మూసివేశారు.15 రోజుల తర్వాత ఈ క్యాంప్ కార్యాలయాలను తిరిగి ప్రారంభించనున్నారు.

ఏపీ రాష్ట్రంలో ప్రతి రోజూ కరోనా కేసులు వందల సంఖ్యలో నమోదౌతున్నాయి. బుధవారం నాడు రాష్ట్రంలో 1062 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 22,259కి చేరుకొన్నాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో 15 మంది మృతి చెందారు. 

click me!