ఏపి బిజెపిపై కుట్రలు...కన్నా కూడా పసుపుదండులో భాగస్వామే?: విజయసాయి సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : Jul 09, 2020, 10:51 AM IST
ఏపి బిజెపిపై కుట్రలు...కన్నా కూడా పసుపుదండులో భాగస్వామే?: విజయసాయి సంచలనం

సారాంశం

ఏపీలో బిజెపి లేకుండా చేయాలన్న కుట్రలు చంద్రబాబు పన్నుతున్నారని మిమ్మల్ని అలెర్ట్ చేయడం తప్పా? అని ఏపీ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. 

అమరావతి: ఏపీలో బిజెపి లేకుండా చేయాలన్న కుట్రలు చంద్రబాబు పన్నుతున్నారని మిమ్మల్ని అలెర్ట్ చేయడం తప్పా? అని ఏపీ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణను వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. అన్ని పార్టీల వ్యవహారాల్లో తలదూర్చే కన్నా తమపార్టీ గురించి మాత్రం అలెర్ట్ చేసినా పట్టించుకోవడం లేదని... ఆయన కూడా పసుపు మిడతల దండులో భాగస్వామేనా? అని విజయసాయి నిలదీశారు. 

''ఏంటి కన్నా! తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు. లేస్తే మనిషిని కాదన్నట్లు లేఖాస్త్రాలు సంధిస్తారు.  టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా..?బాబు అజెండాతో కమలం పువ్వును ఆంధ్రాలో కబళించే పనిలో ఉన్న... ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా.?'' అంటూ ట్విట్టర్ వేదికన ఏపి బిజెపి అధ్యక్షుడికి విజయసాయి చురకలు అంటించారు. 

read more   విశాఖ నుంచే వైఎస్ జగన్: డీజీపీ గౌతం సవాంగ్ పర్యటన ఆంతర్యం ఇదే...

''నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయట్లేదని పచ్చ పార్టీ ఆందోళనకు దిగడంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కడిగి పారేశారు. బాబు ఎక్కడ హర్ట్ అవుతాడో అని కన్నా సైలెంటయ్యాడు. 30 లక్షల పట్టాలు సిద్ధమైనప్పటి నుంచి ‘విజనరీ’ చీకటి మిత్రులకూ టెన్షన్ పట్టుకుంది'' అని పేర్కొన్నారు.
 
''ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుని పేదలపై పగ సాధించడమే కాకుండా దొంగే దొంగ, దొంగ అని అరిచినట్టు నిరసన దీక్షలు చేస్తారట TDP(తెలుగు దొంగల పార్టీ)నేతలు. పట్టాల పంపిణీ వాయిదా వేయకుండా తక్షణమే అందజేయాలని డిమాండు. అడ్డుకునేది మీరే. ఇవ్వాలని అడిగేది మీరే. మరీ ఇంత సిగ్గు విడిచి రాజకీయం చేయాలా'' అని విజయసాయి మండిపడ్డారు. 
 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్