ఏపీలో పెట్రోల్, డీజీల్‌లపై రూ. 1 సెస్ విధింపు: రూ. 500 కోట్ల ఆదాయం

By narsimha lodeFirst Published Sep 18, 2020, 3:35 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజీల్ లపై  ఒక్క రూపాయి సెస్ విధిస్తూ  శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజీల్ లపై  ఒక్క రూపాయి సెస్ విధిస్తూ  శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచుకొనే ప్రయత్నాలను చేస్తోంది. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజీల్ లపై లీటర్ కు రూ. 1 సెస్ ను విధించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు  జారీ చేసింది.

పెట్రోల్, డీజీల్ లపై లీటర్ పై రూ.1 సెస్ విధించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ. 500 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది.  సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రోడ్ల నిర్మాణం కోసం కేటాయించనుంది. రోడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ కు  ఈ నిధులను  కేటాయించనున్నట్టు  ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నిధులను ఉపయోగించి రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను  రిపేర్ చేయాలని సీఎం వైఎస్ జగన్  అధికారులను ఆదేశించారు.

గత ఏడాది ఫిబ్రవరి మాసంలో రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్  రూ. 3వేల కోట్లను అప్పుగా తీసుకొంది. ఈ నిధులను అప్పటి సీఎం చంద్రబాబునాయుడు పసుపు, కుంకుమ కోసం మళ్లించారని  ఆరోపణలున్నాయి.
 

click me!