ఏపీ సచివాలయంలో కరోనా కలకలం... మరో మహిళా ఉద్యోగి మృతి

By Arun Kumar P  |  First Published Apr 19, 2021, 2:41 PM IST

ఇప్పటికే ఇద్దరు సచివాలయ ఉద్యోగులు కరోనా కారణంగా మరణించగా తాజాగా మరో మహిళా ఉద్యోగి కూడా మృత్యువాతపడ్డారు. 


అమరావతి: ఏపీ సచివాలయంలో కరోనా మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులు కరోనా కారణంగా మరణించగా తాజాగా మరో మహిళా ఉద్యోగి కూడా మృత్యువాతపడ్డారు.  పంచాయతీ రాజ్ శాఖలో సెక్షన్ ఆఫీసరుగా పని చేస్తున్న శాంతకుమారి ఇవాళ ఉదయం మృతిచెందారు. రెండు రోజుల క్రితమే సెక్రటేరియట్ లోనే పని చేసే శాంతకుమారి భర్త చనిపోగా తాజాగా ఆమె కూడా చనిపోయారు. దీంతో సచివాలయ ఉద్యోగులు భయం భయంగానే విధులు నిర్వర్తిస్తున్నారు. 

సచివాలయంలో కరోనాతో ఉద్యోగులు మృతి చెందడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనాతో మృతి చెందిన సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ ఆఫీసర్ జి.రవికాంత్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్రెటరీ గా పనిచేస్తున్న పద్మారావుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతి చెందిన ఉద్యోగుల ఆత్మకు శాంతి కలగాలని తన చాంబర్‌లో రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

Latest Videos

read more  టెన్త్, ఇంటర్ పరీక్షలపై నేడు ఏపీ సర్కార్ నిర్ణయం: కరోనాపై జగన్ సమీక్ష

ఈ సందర్బంగా ఆయన సచివాలయ ఉద్యోగులు కోవిడ్ జాగ్రత్తలను పాటించాలని, ఎక్కడైనా అస్వస్థత, అనారోగ్య లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాల్లో తప్పనిసరిగా కాల వ్యవధిని అనుసరించి రెండు టీకాలను వేయించుకోవాలని కోరారు. కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు మరింత అప్రమత్తంగా వుండాలని కోరారు. మాస్క్ తప్పని సరిగా ధరిస్తే, భౌతికదూరంను పాటించాలని సూచించారు.
 

click me!