చట్టి ఘటన : ఇద్దరు భార్యలపై భర్త పైశాచికం.. స్పందించిన మహిళా కమిషన్..

By AN TeluguFirst Published Apr 19, 2021, 12:20 PM IST
Highlights

అమరావతి : తూర్పుగోదావరి ఏజన్సీ చింతూరు మండలం చట్టి ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ స్పందించారు.

అమరావతి : తూర్పుగోదావరి ఏజన్సీ చింతూరు మండలం చట్టి ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ స్పందించారు.

చట్ట విరుద్దంగా ఇద్దరిని పెళ్లి చేసుకోవడమే కాకుండా.. ఇద్దరు భార్యలు సుమతి, జయమ్మలపై భర్త  కళ్యాణం వెంకన్న చేసిన పాచవిక దాడి, హత్యాయత్నాలు అమానుషచర్య అంటూ ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు.

తూర్పుగోదావరి జిల్లా ఏజన్సీ చింతూరు మండలం చట్టి ఘటనపై జిల్లా ఎస్పీ నయిం హస్మీ తో ఆమె ఫోన్ లో మాట్లాడారు. ఈఘటనపై సత్వతమే చర్యలు తీసుకుని ఆ మహిళలిద్దరికీ రక్షణ కల్పించాలని, మృగంలా ప్రవర్తించిన భర్త కళ్యాణం వెంకన్నను తక్షణమే అరెస్టు చేయాలని మాహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

చట్టీలో ఓ భర్త తన ఇద్దరు భార్యలుపై మృగంలా ప్రవర్తించి.. అత్యంత క్రూరంగా హింసిస్తూ ఆ ఘటనలను పైశాచికంగా మరో వ్యక్తితో వీడియోస్ తీయించాడు. ఈ నెల 3న ఈ ఘటన జరిగినా..  బాధిత మహిళలు 15 రోజుల తర్వాత ముందుకొచ్చి ధైర్యం చేసి చింతూరు  పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియోలో ఒక భార్య పై పెట్రోలు పోసి, వేడివేడినీళ్ళల్లో చేతులు ముంచి చిత్రహింసలు పెట్టగా, మరో భార్యను చేతులు కట్టేసి అత్యంత దారుణంగా కాళ్ళతో తొక్కిపెట్టి  కటింగ్ ఫ్లయర్, కత్తితో చెవి, ముక్కు కత్తిరించడం హృదయవిదారకంగా ఉన్నాయి.

ఇద్దరు భార్యలపై విచక్షణా రహితంగా ప్రవర్తించి, హత్యాయత్నం చేసిన కల్యాణం వెంకన్నను వెంటనే పోలీసులు అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. 

మృగంలా అఘాయిత్యానికి పాల్పడ్డ భర్త కల్యాణం వెంకన్న నుంచి ఆ మహిళలు తప్పించుకుని పుట్టింటికి పారిపోకపోతే వారి ప్రాణాలు దక్కేవికావని అన్నారు. ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులు ధైర్యంగా ముందుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.

మహిళల రక్షణకు సిఎం జగన్  అండగా వున్నారని, మహిళలుపై వేధింపులకు గురిచేసే వారిపై కఠినమైన చట్టాలతో చర్యలు తీసుకుంటున్నారన్నారు. మహిళా కమిషన్ బాధితులకు అండగా నిలబడుతుందని, వేధింపులు,  సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని వాసిరెడ్డి పద్మ అన్నారు. 

అలాగే కాకినాడ అశోక్ నగర్ లో యువతులను చదివిస్తున్న రాజేశ్వర్ దయాళ్.. సాయం ముసుగులో ఆ యువతులను లైంగిక వేధింపులకు గురిచేయడం అమానుషం అన్నారు.

ఈ ఘటనలో బాధిత యువతులకు రక్షణ కల్పించి, వేధిస్తున్న  రాజేశ్వర్ దయాళ్
 పై చర్యలు తీసుకోవాలని కూడా మహిళా కమిసన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎస్పీని ఆదేశించారు. 

click me!