పంచాయితీ ఎన్నికలు: రేపటి నుండి ఎస్ఈసీ జిల్లాల టూర్

Published : Jan 28, 2021, 05:48 PM ISTUpdated : Jan 28, 2021, 05:53 PM IST
పంచాయితీ ఎన్నికలు: రేపటి నుండి ఎస్ఈసీ జిల్లాల టూర్

సారాంశం

పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు.  


అమరావతి: పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్ల గురించి ఎన్నికల సంఘం కమిషనర్ పరిశీలన జరపనున్నారు. ఈ నెల 29న  ఉదయం ఏడుగంటలకు ఆయన బెంగుళూరుకు విమానంలో చేరుకొంటారు. బెంగుళూరు నుండి రోడ్డు మార్గంలో ఆయన అనంతపురం చేరుకొంటారు. రేపు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

also read:చంద్రబాబు స్పూర్తితో నిమ్మగడ్డ పనిచేస్తున్నారు: అంబటి విమర్శ

ఈ సమావేశం పూర్తైన తర్వాత ఆయన కర్నూల్ చేరుకొంటారు. సాయంత్రం వరకు ఆయన అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 30న కడప జిల్లా అధికారులతో ఎస్ఈసీ సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణ విషయంలో  జిల్లాల అధికారులకు ఎస్ఈసీ దిశా నిర్దేశం చేయనున్నారు. 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో  రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చిన విషయం తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు