స్వేరోస్ సెగలు: ఐపీఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఎంపీ రఘురామ ఆగ్రహం, రాష్ట్రపతికి ఫిర్యాదు

By Siva KodatiFirst Published Mar 19, 2021, 3:49 PM IST
Highlights

తెలంగాణ ఐపీఎస్ అధికారి, స్వేరోస్ సంస్థ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహారంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు

తెలంగాణ ఐపీఎస్ అధికారి, స్వేరోస్ సంస్థ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహారంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు. స్వేరోస్ సంస్థ కార్యకలాపాలు, స్వేరోల ఆగడాలు, 7 ఏళ్ల నుండి అదే పోస్టులో ప్రవీణ్ కుమార్ పాతుకుపోవడం, డీవోపీటీ నిబంధనల అతిక్రమణ వంటి అంశాలను ప్రవీణ్ కుమార్ ఫిర్యాదులో ప్రస్తావించారు. 

కాగా ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. స్వేరోస్ భీమ్ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో స్వేరో సభ్యులతో కలసి ఆయన హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడం వివాదాస్పదంగా మారింది.

తాము రాముడు, కృష్ణుడును నమ్మబోమని, పెద్దలకు పిండ ప్రదానాలు లాంటివి కూడా చేయబోమంటూ కొందరు ప్రతిజ్ఞ చేశారు. ఇదే సమయంలో ప్రవీణ్ కుమార్ కూడా చేతులు చాచి ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఐపీఎస్‌ అధికారిగా అత్యున్నత హోదాలో వున్న ప్రవీణ్‌కుమార్‌ హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా ప్రవర్తించారంటూ హిందూ సంస్థలు, ప్రతినిధులు మండిపడుతున్నారు. 

click me!