: చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్ల విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.
అమరావతి: చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్ల విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.గత ఏడాది మార్చిలో ఈ రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఈ రెండు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అక్రమాలు చోటు చేసుకొన్నాయని విపక్షాలు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశాయి. వీటి ఆధారంగా ఈ రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాలని ఆదేశించింది.
కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం: సీఎస్‌కి లేఖ రాయనున్న నిమ్మగడ్డ
undefined
గత ఏడాది మార్చిలో ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినా కూడ ప్రభుత్వం ఈ రెండు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయలేదు. ఈ ఏడాది పిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయమై గురువారం నాడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కాన్ఫరెన్స్ సమయంలో ఈ రెండు జిల్లాల కలెక్టర్లను మినహాయించి ఇతర జిల్లాల కలెక్టర్లతో ఆయన స్థానిక సంస్థల ఎన్నికల విషయమై చర్చించారు.ఈ రెండు జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్చించారు. గత ఏడాదిలో ఆదేశాలు జారీ చేసినా ఈ ఇద్దరిని బదిలీ చేయకపోవడంపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు ఎస్ఈసీ.